Thursday, April 18, 2024

శ్రీవారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు జడ్జి

తప్పక చదవండి

తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల గిరులు కిటకిటలాడుతున్నాయి. కొండపై ఉన్న కంపార్ట్‌మెంట్లు పూర్తిగా భక్తులతో నిండి ఏటీ గెస్ట్‌హౌజ్‌ వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న శ్రీవారిని 62,407 మంది భక్తులు దర్శించుకోగా 33,895 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.56 కోట్లు వచ్చిందని తెలిపారు. కాగా శుక్రవారం స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి. రామసుబ్రహ్మణ్యం దంపతులు స్వామివారిలో సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీఈవో ఏవీ ధర్మారెడ్డి, అర్చకులు ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు. పూజల అనంతరం రంగనాయకుల మండపంలో వేదాశ్వీరచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువతో సన్మానించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి స్వామివారి అభిషేక సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు