- అధికారులు ఎలక్షన్ డ్యూటీకి సిద్ధంగా ఉండాలి
- సమస్యాత్మక గ్రామాల సమాచారం తెలిసి ఉండాలి
- పోలీస్ అధికారుల సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్‌పీి కోటి రెడ్డి
వికారాబాద్ : పాత నేరస్తులు రౌడీషీటర్స్ పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి పోలీసు అధికారులకు సూచించారు. గురువారం జిల్లా లోని పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా రాబోయే ఎన్నికల సందర్భంగా జిల్లా పోలీస్ అధికారులు తీసుకోవాల్సిన జాగ్రతలు, సమాచారం తదితర విషయాకపై ఎస్పీ మాట్లాడుతూ… త్వరలో సాధారణ అసెంబ్లీ ఎన్నికలు రాబోతుండటంతో జిల్లా లోని ప్రతి ఒక్క పోలీస్ అధికారి అప్రమత్తంగా ఉండాలని, తమ తమ పోలీస్ స్టేషన్ ల యొక్క శాంతి భద్రతలకు సంబందించిన పరిస్థితిలపైనా ప్రత్యేక అవగాహన ఉండాలని, తమ తమ పోలీస్ స్టేషన్ లలో సమస్యాత్మక గ్రామాలు, పట్టణాల పైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. అవసరం అనుకున్నచో రెవెన్యూ అధికారుల ముందు బైండోవర్ చేయాలని, తమ తమ పోలీస్ స్టేషన్ పరిధిలలో ఉన్నటువండి పోలింగ్ స్టేషన్ లు , పోలింగ్ లోకషన్ లు, ఎన్ని రూట్స్ ఉన్నాయి, సమస్యాత్మక గ్రామాలు మొదలగు వాటి ఒక్క సమాచారం ప్రతి ఒక్కరూ తెల్సుకోని ఉండాలి. తర్వాత గత ఎన్నికలలో అయిన కేసుల వివరాలను, అలజడులను గురించి పోలీస్ స్టేషన్ ల వారీగా అధికారులతో చర్చించారు.
పదోన్నతులు పొందిన అధికారులకు ఘన సన్మానం… జిల్లా ఎస్‌పి సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్‌పి ముందుగా డిఎస్‌పి నుండి అదనపు డిఎస్‌పి గా పదోన్నతి పొందిన వికారాబాద్ సబ్ డివిజన్ డిఎస్‌పి సత్యనారాయణ ని, ఇన్స్పెక్టర్ నుండి డిఎస్‌పి గా పదోన్నతి పొందిన పోలీస్ కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ డివి రంగా రెడ్డి ని, వికారాబాద్ జిల్లా నుండి హైదరాబాద్/సైబరాబాద్ జిల్లాల కు బదిలీపైన వెళ్ళిన సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు ని, డిఎస్‌బి ఇన్స్పెక్టర్ నరేందర్ ని, మోమిన్ పేట్ ఎస్‌ఐ గా పని చేసి ఇన్స్పెక్టర్ ఇతర జిల్లాకు వెళ్ళిన విజయ్ ప్రకాష్ ని, జిల్లా నుండి సిఐడి కి బదిలీపైన వెళ్ళిన సిసిఎస్ ఇన్స్పెక్టర్ దాసు లను జిల్లా ఎస్‌పి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్‌పి శ్రీనివాస్ రావు, డిటిసి అదనపు ఎస్‌పి మురళీధర్, వికారాబాద్ సబ్ డివిజన్ అదనపు ఎస్‌పి సత్యనారాయణ, పరిగి డిఎస్‌పి కరుణా సాగర్ రెడ్డి, తాండూర్ డిఎస్‌పి శేఖర్ గౌడ్, జిల్లా లోని సర్కిల్ ఇన్స్పెక్టర్‌లు, ఇన్స్పెక్టర్‌లు , ఎస్‌హెచ్‌ఓలు, ఇతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
తప్పక చదవండి
-Advertisement-