Tuesday, May 21, 2024

సమాజ ప్రగతిలో వృత్తి కులాల పాత్ర అమూల్యమైనది..

తప్పక చదవండి
  • డాక్టర్ వక్లాభరణం కృష్ణమోహన్ రావు
  • వృత్తి కులాలకు ఒక లక్ష రూపాయల పథకం దేశానికి ఆదర్శం : – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
    హైదరాబాద్, కులాలుగా సేవ కులాలుగా దశాబ్దాలుగా సమాజ ప్రగతికి కృషిచేసిన వృత్తి కులాల సేవా కులాల త్యాగం కృషి అమూల్యమైనదని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. వృత్తి కులాలకు వారి అభివృద్ధికి ఎంత చేయూతను అందించిన అది తక్కువేనని అన్నారు వృత్తి కులాలకు ఎంబీసీలకు, ప్రభుత్వం సహాయం అందించడం గొప్ప శుభారంభమని ఆయన తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వృత్తి కులాల ఎంబీసీల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.. బీసీ కులాల ఫెడరేషన్ అధ్యక్షుడు దుర్గారావు రామా ప్రధాన కార్యదర్శి కీర్తి యుగేందర్ తో సమన్వయకర్తలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిధులుగా రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు, సిహెచ్ ఉపేంద్ర కిషోర్ గౌడ్, జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి స్వామి పాల్గొన్నారు. వివిధ వృత్తి సేవా కులాలకు సంబంధించిన ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమాజంలో శాశ్వతంగా పేదరిక నిర్మూలన కోసం సంక్షేమ పథకాలను అమలులోకి తెస్తూ ఒక ఉదాత్త లక్ష్యంతో పనిచేస్తుందని అన్నారు. సిహెచ్ ఉపేంద్ర ప్రసంగిస్తూ బీసీల అభివృద్ధికి పకడ్బందీ ప్రణాళికలతో ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. కిషోర్ గౌడ్ ప్రసంగిస్తూ.. పేదరికం వారి బాధలు సీఎం కేసీఆర్ కు క్షుణ్ణంగా తెలుసు అందుచేతనే ఉన్నత లక్ష్యాల సాధనకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. దుండ్ర కుమారస్వామి ప్రసంగిస్తూ తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికి దిక్సూచిలుగా నిలుస్తున్నాయన్నారు గొర్రెల పంపిణీ ,చేపల పంపిణీ, ఎంబీసీలకు 100 శాతం ఆర్థిక చేయూత. ఈ కార్యక్రమంలో సుమారు 40 కుల సంఘాల ప్రతినిధులు ప్రభుత్వ చర్యకు అభినందనలు తెలియజేశారు అభివృద్ధి నిమిత్తం కొన్ని అభిప్రాయాలను వెలిబుచ్చారు సూచనలు చేశారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు