Sunday, October 6, 2024
spot_img

సిద్దిపేట మున్సిపాలిటీ మరుగుదొడ్లు స్కామ్ పై తెలంగాణ విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ లీడర్ బక్క జడ్సన్..

తప్పక చదవండి

దోపిడీ..షేమ్ దోపిడీ…షీ టాయ్ లెట్స్ పై ఇదేం దోపిడీ…డబుల్ బెడ్ రూమ్స్ వాసులకి అవమానమా… సిగ్గుచేటు.. రాష్ట్ర స్థాయిలో వందల కోట్ల రూపాయల నష్టం జరుగుతుందా…బుధవారం రోజు తెలంగాణ విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ కు టీపీసీసీ కార్యదర్శి అయిత గిరిబాబుతో కలిసి. సిద్దిపేట మున్సిపాలిటీ మరుగుదొడ్లు స్కామ్ విచారణ చేయాలి అని ఫిర్యాదు చేశారు బక్క జడ్సన్..

ఒక ఉదాహరణగా సిద్దిపేటలో చూడొచ్చు ఈ విచిత్రం… ఇదిగో..రాష్ట్రం లో స్మార్ట్ సిటీస్ లో భాగంగా ఉన్న.. స్వచ్ఛ సర్వెక్షన్ లో భాగంగా జరిగిన ఈ దోపిడీ విలువ ఒక్కో దానికి రూ. 12 లక్షలు…అంటే మొత్తం కోట్ల లోనే.. ఇవన్నీ కేంద్ర హౌసింగ్, పట్టణ మంత్రిత్వ శాఖ ఇచ్చిన నిధులతో ఏర్పాటు చేశారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కట్టిన ఈ డబుల్ బెడ్రూంల ఒక్కో విలువ సుమారు 5 లక్షల 4 వేలు.. లేదా 5 లక్షల 30 వేలు… ఆ డబుల్ బెడ్రూంలలో బాత్రూం లెట్రిన్ లు కలిసి వస్తాయి… లేకుండా ఇండ్లు ఉండవు కదా…అయితే ఈ నయా దోపిడీ 12 లక్షలు కేవలం ఈ షి టాయిలెట్స్ కి అంటే స్పెషల్ ఈ బాత్రూంలకి అంటే డబుల్ బెడ్ రూం లకి డబుల్ పైన ఖర్చు.. అంటే ఒక డబుల్ బెడ్ రూంకి పల్లె టూర్లలో 5 లక్షల 4 వేలు, పట్టణం లో 5 లక్షల 30 వేలు…ఇవి రెండు కడితే 10 లక్షల 8 వేలు లేదా 60 వేలు..అయితే స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా, కేంద్ర హౌసింగ్, పట్టణ మంత్రిత్వ శాఖ కింద స్వచ్చ భారత్ మిషన్,స్వచ్చ సర్వేక్షన్ లో భాగంగా టాయ్ లెట్స్ అని ప్రజలకు ఉపయోగ పడే మూత్ర శాలలు కట్టి, వాటిల్లో కూడా దోపిడీ. అవి కూడా నాలుగు డబ్బాలుగా పాతిన ఈ మూత్ర శాలలు.. వీటికోసం కేవలం కట్టే 4 బాత్ రూం ల/ టాయ్ లెట్ల ఖర్చు అక్షరాలా 12 లక్షలు.. అంటే రెండు డబుల్ బెడ్ రూంల ఖర్చు కంటే ఎక్కువ… ఆ రెండు డబుల్ బెడ్ రూం ఫ్లాట్ లలో బాత్ రూం లు ఉండవా… అంటే డబుల్ బెడ్ రూం, వంట రూం, హాల్, రెండు బాత్ రూం లు…ఇలా వస్తవి… మరీ కేవలం 4 బాత్ రూం లకే ఇదేం దోపిడో అర్థం చేసుకోవచ్చు… అంటే నాలుగు డబ్బా టాయ్ లెట్ల కంటే ఈ డబుల్ బెడ్ రూముల బతుకులు హీనమా… అలా చూడటం ఎంతవరకు సమంజసం…వర్షం పడగానే ఊరుస్తున్నాయి అంటే ఎంత మహా గొప్ప కట్టడాలు అర్థం చేసుకోవచ్చు.. అయితే అవి ఏదైనా గానీ ఈ స్వఛ్చ సర్వెక్షన్ పేరిట కట్టిన ఈ డబ్బా లెట్రిన్ లు వీటివల్ల ఆ దోపిడీ వల్ల నిజంగా డబుల్ బెడ్ రూం వాసులను అవమానించడమే… ఇది చాలా బాధాకరం.. వారికి క్వాలిటీ గా కట్టిస్తే వారు ఎంతో సంతోషంగా ఉంటుండే…పాపం వాళ్ళ బాధ వర్ణనా తీతం… అయితే కాదేదీ దోపిడీకి అనర్హం అన్నట్లుగా ఈ నాలుగు డబ్బా టాయ్ లెట్స్ దొరికాయి… మాంచి కలరింగ్ ఇచ్చి 12 లక్షలు బూడిదలో పోసిన పన్నీరు లా అయింది… ఎందుకంటే వీటిలో ఎప్పుడో ఒకసారి వాటర్ ఉంటాయి… అంటే పేపర్లు పట్టుకెల్లాలా… ఇదేమి చిత్రం రా నాయనా…ఇదేమి దోపిడీ రా నాయనా అంటూ వెక్కిరిస్తున్నాయి ఈ చేష్టలు… అంటే ఇవన్నీ క్వాలిటీగా తక్కువ ఖర్చుతో మరిన్ని కడితే పరవాలేదు.. అయితే కాంట్రాక్టర్ లు టెండర్ లు లాభం తోనే వేస్తారు.. అయితే ఇక్కడ మాత్రం లాభం మూడు రెట్లు… ఇది కేవలం అధికారుల, నాయకుల, కాంట్రక్టర్ ల జేబులు నిండడానికే అన్నట్లుగా తయారయ్యింది…
అంటే రాష్ట్ర స్థాయిలో అన్ని నియోజవర్గలలో ఈ తరహా మున్సిపల్, గ్రామ పంచాయితీ ల ఆమోదంతో అన్నిచోట్ల ఈ బహిరంగ టాయ్లెట్ల ను నిర్మిస్తారు. అయితే ప్రతీ చోట లక్షల రూపాయలు కుమ్మరించి కాంట్రాక్టర్ ల జేబులు, అవినీతి అధికారుల జేబులు నింపే బదులు రాష్ట్ర స్థాయిలో కలిపి ఒకే టెండర్ ద్వారా వివిధ కంపెనీలను ఆహ్వానిస్తే డబుల్ బెడ్రూమ్ లు కట్టే ఖర్చు కంటే సగం ఖర్చుతో కట్టే అవకాశం ఉంది.. అంటే ఒక్కో చోట 9లక్షల 50 వేల మిగులు. మన రాష్ట్ర ప్రభుత్వానికి… అంటే మొత్తంగా చూస్తే వందల కోట్లాది రూపాయల లాభం.. స్వచ్ఛ సర్వేక్షన లో , స్వచ్చ భారత్ మిషన్ పై భాగంగా లేదా సామాజిక భాధ్యతలో భాగంగా ఎన్నో కంపెనీలు లక్షల, కోట్ల రూపాయలు పలు చోట్ల వెచ్చించాయి.. అంటే అవన్నీ వృదా అయ్యాయా.. ఇదంతా పెద్ద పెద్ద అధికారుల అవినీతి వల్ల జరిగినా తప్పిదమా.. దీనికి కొన్ని ఉదాహరణలు..
బీ.డీ.ఎల్. వారు 2కోట్లకు పైగా ఇచ్చారు. ఎస్.బీ.ఐ. వారు ఆరు కోట్ల రూపాయలతో 36 టాయ్లెట్ లు,ఇంకా మరికొన్ని సంస్థలు షీ టాయిలెట్స్/హీ టాయిలెట్స్ అని సెన్సార్ లతో నిర్మించారు.. ఇపుడు చాలా చోట్ల వాటి గతి అదోగతి అని తెలిసింది.. అంటే అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే.. అంటే ఇచ్చేవాడే కరువైన ఈ రోజుల్లో ఇచ్చినా వాటిని కూడా అవినీతికి వారి దాహానికి కోట్ల రూపాయలు ఆవిరైపోతున్నాయి.. ఇప్పుడు ఆ లెట్రిన్, బాత్ రూంలలో దుకాణాలు వెలిశాయి… సరిగ్గా నాలుగేళ్ల కిందటే జీ.హెచ్.ఎం.సి. లో 7 కోట్లకు పైగా అక్రమాలు బయటపడ్డాయి.. అప్పుడు అదే ఎక్కువ ఇప్పుడు ఇంకా ఎక్కువ బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు సుమారు ఒక్క జీ.హెచ్.ఎం.సి. లో 7000 లకు పైగా, ఇక రాష్ట్ర స్థాయిలో ఇంకెన్ని వేల ఈ పబ్లిక్ టాయ్లెట్ లు నిర్మించారు..నిర్మిస్తే మంచిదే కానీ ఒక లక్ష,రెండు లక్షలు అయ్యే దగ్గర 12 లక్షలు అంటే ఎంత పెద్ద దోపిడీ అర్థం చేసుకోవచ్చు.. అంటే ఇంకా ఆరితేరారు అని అర్థం. ఇవన్నీ నాయకుల, అధికారుల పాలిట కల్పతరువు లా మారాయి.. మరి ఇవన్నీ కేంద్ర చట్టాల మేరకు, శాఖల మేరకు నిర్మితమవుతున్నవి అంటే సిబిఐ విచారణకు అర్హమైన అంశాలే.. రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ హెల్త్, శానిటైజేశన్, మరీ ముఖ్యంగా మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లపై వారు చేసిన పనులపై సిబిఐ విచారణ జరిగితే మరిన్ని వందల, వేల కోట్ల అక్రమాలు బయటపడే అవకాశం ఉంది..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు