Wednesday, April 24, 2024

రెండవ విడత గొర్ల పంపిణీ కార్యక్రమం

తప్పక చదవండి
  • హర్షం వ్యక్తం చేసిన గొల్ల కురుమలు

హైదరాబాద్ : ఇతర రాష్ట్రాలకు మాంస ఉత్పత్తులను అందించే విధంగా గొల్ల కురుమలు ఎదగాలని ఉమ్మడి మెదక్ జిల్లా గొర్రెల పెంపకం దారుల సంఘం చైర్మన్ పోచబోయిన శ్రీహరి యాదవ్ అన్నారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి జగత్ కుమార్ రెడ్డి, జాతీయ ఉపాధి హామీ కౌన్సిల్ మెంబర్ తుపాకుల బాలరంగం తో కలిసి రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సిద్దిపేట అర్బన్ మండలం నాంచార్ పల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ కొన్నే కల్పన నర్సింలు ఆధ్వర్యంలో 21 మంది గొల్ల కురుమల లబ్ధిదారులకు రెండవ విడత గొర్ల పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు అధ్యక్షులు మామిండ్ల ఐలయ్య యాదవ్ పాల్గొని మాట్లాడారు.. ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీలను గొల్ల కురుమలు సద్విని చేసుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి జగత్ కుమార్ రెడ్డి అన్నారు. డీడీలు కట్టిన ప్రతి గొల్ల కురుమ లబ్ధిదారులకు గొర్లు అందజేయడం జరుగుతుందని, ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. గత ప్రభుత్వ ప్రభుత్వాల ఆయాoలో గొల్ల కురుమలను పట్టించుకున్న నాధుడే కరువైయ్యాడని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గొల్ల కురుమల అభివృద్ధికి పాటుపడుతుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు, మంత్రి హరీష్ రావు కు గొల్ల కురుమలు రుణపడి ఉంటారని జాతీయఉపాధి హామీ కౌన్సిల్ నెంబర్ తుపాకుల బాలరంగం అన్నారు. ఈ పథకాన్ని తప్పుదోవ పట్టించే విధంగా కొన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులు అవాకులు చెవాకులు చేస్తున్నారని వారికి ఎన్నికల సమయంలో గొల్ల కురుమలు సరైన బుద్ధి చెప్పాలని ఉమ్మడి జిల్లా గొర్ల పెంపకం దారుల సంఘం చైర్మన్ పోచబోయిన శ్రీహరియాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ అధికారి డాక్టర్ చతుర్వేది బీఆర్ఎస్ అర్బన్ మండల అధ్యక్షులు ఎద్దు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
నాంచార్ పల్లి గ్రామానికి రెండో విడత గొర్రెల పంపిణీ లో ఇరవైక మందికి గాను 21 యూనిట్లు మంజూరు చేసినందుకు హరీష్ రావుకు ఉమ్మడి మెదక్ జిల్లా గొర్రెల పెంపకం సంఘం చైర్మన్ శ్రీహరి యాదవ్ గ్రామం సర్పంచ్ కొన్నే కల్పననరసింహులు, ఎంపీటీసీ బోనాల రంగం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 20 గొర్రెలు ఒక పొట్టేలు గొర్రెను ఒక యూనిట్కు మొత్తం 21 గొర్రెలను అందజేస్తున్నట్లు సర్పంచ్ నరసింహులు తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు