Wednesday, July 24, 2024

సర్కార్ బడి ముద్దు.. ప్రైవేట్ బడి వద్దు..

తప్పక చదవండి

హైదరాబాద్, సర్కార్ బడి ముద్దు.. ప్రైవేట్ బడి వద్దు అని ఆశిఫాబాద్ ఎమ్మెల్యే అత్రం సక్కు అన్నారు. మంగళవారం ఆయన తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు భాగంగా జూన్ 20 పడి పండుగ సందర్భంగా లింగాపూర్ మండలంలోని జాముల ధర, వంజారిగూడ,కొత్తపల్లి, గ్రామాలలో గల మన ఊరు మనబడి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. వారికి గ్రామ ప్రజలు డబ్బు చెప్పులతో ఘనంగా స్వాగతం పలికారు.. అనంతరం ఎమ్మెల్యే నూతన మన ఊరు మనబడి భవనాలను ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఆయన కాసేపు ఉపాధ్యాయుడుగా మరి విద్యార్థులకు పాఠాలు బోధించారు.. 20 సంవత్సరాల క్రితం ఆయన ఒక ఉపాధ్యాయుడిగా అందించిన సేవలను గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాలలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ మన ఊరు మనబడి కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తమ పిల్లలను ప్రభుత్వ బడులకి పంపించాలని కోరారు.. ప్రైవేటుకు ధీటుగా సర్కారు బడులు కొత్త హంగులతో లక్షల రూపాయలు వెచ్చించి కొత్త భవనాలను పిల్లలకు ఆకర్షణంగా రంగులు బొమ్మలు, ఆట వస్తువులు, బెంచులు, కుర్చీలు, ల్యావెట్రి లు , బాత్రూంలో నీటి సౌకర్యంతో అన్ని సకల సౌకర్యంతో సర్కారు బడులను తమరి పిల్లలకు కల్పిస్తుందని ఆయన అన్నారు.. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి కొడుమేత సుధాకర్, ఎంపీపీ ఆడే సవిత ప్రేమ్, జడ్పిటిసి ఆడే రక్క బాయి, లక్యా నాయక్, వైస్ ఎంపీపీ అనే అత్మారాం, ఎంపీడీవో ప్రసాద్, ఎమ్మార్వో రాజేశ్వరి, ఆర్విఎం శశిధర్, జాబుల ద్వారా సర్పంచ్ సలాం సోని రావు, కొత్తపల్లి సర్పంచ్ రాథోడ్ ఉదయలక్ష్మి, జాముల్ ధర పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మంజులత, ప్రవీణ్, కొత్తపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విలాస్, వంజారిగూడ ప్రధానోపాధ్యాయుడు కైలాస్, లింగాపూర్ జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మధుకర్ రెడ్డి, మోహిన్, జాబులు ధర కొత్తపల్లి వంజారిగూడ పాఠశాలల విద్య కమిటీ చైర్మన్ లు, లింగాపూర్ ఎస్సై మనోహర్, ఆర్ ఐ ప్రకాష్, ప్రవీణ్, మండల నాయకులు ఆత్రం అనిల్, సలీం, జాముల్ ధర గ్రామ పటేల్ జోగు నగ జంగు జ్యోతి రామ్, సర్పంచులు, గ్రామ ప్రజలు, విద్యార్థులు, యువకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు