Monday, May 6, 2024

తగ్గిన బంగారం ధరలు…

తప్పక చదవండి
  • ఇటీవల దూకుడుగా పెరిగిన బంగారం ధర తిరిగి తగ్గుముఖం పట్టింది.
  • శుక్రవారం హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లో తులం 24 క్యారట్ల పుత్తడి ధర రూ.310 మేర క్షీణించి రూ. 60,440 స్థాయి వద్ద నిలిచింది.
  • క్రితం రోజు ఇది రూ. 60,750 గరిష్ఠానికి చేరింది.
    హైదరాబాద్‌ : ఇటీవల దూకుడుగా పెరిగిన బంగారం ధర తిరిగి తగ్గుముఖం పట్టింది. శుక్రవారం హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లో తులం 24 క్యారట్ల పుత్తడి ధర రూ.310 మేర క్షీణించి రూ. 60,440 స్థాయి వద్ద నిలిచింది. క్రితం రోజు ఇది రూ. 60,750 గరిష్ఠానికి చేరింది. తాజాగా 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.300 తగ్గి రూ.55,400 వద్దకు చేరింది. ఢిల్లీలో 24 క్యారట్ల ధర రూ.350 మేర తగ్గి 60,450 స్థాయికి పడిపోయింది.
    అంతర్జాతీయ మార్కెట్లో ఈ వారం ప్రధమార్థంలో పసిడి ఔన్సు ధర ఏడు వారాల గరిష్ఠం 1,980 డాలర్లస్థాయికి చేరిన అనంతరం క్రమేపీ తగ్గి 1,960 డాలర్లకు చేరడంతో దేశీయ మార్కెట్లో సైతం క్షీణిస్తున్నదని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ కమోడిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ సౌమిల్‌ గాంధి చెప్పారు. యూఎస్‌లో జాబ్‌లెస్‌ క్లయింలు అంచనాలకంటే మించి తగ్గడంతో ఫెడ్‌ ఈ ఏడాది మరోదఫా వడ్డీ రేట్లు పెంచవచ్చని మార్కెట్‌ భావిస్తున్నందున పుత్తడి తగ్గుముఖం పట్టిందని వివరించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు