Friday, September 13, 2024
spot_img

రత్నదీప్‌ రిటైల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు టాస్క్‌

తప్పక చదవండి
  • ఆర్‌ఏఐ తెలంగాణ ప్రభుత్వంతో రత్నదీప్‌ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు
    హైదరాబాద్‌ : ప్రముఖ రిటైల్‌ చైన్‌ అయిన రత్నదీప్‌, తెలంగాణ ప్రభుత్వం, అకాడమీ ఫర్‌ స్కిల్‌, నాలెడ్జ్‌ (టాస్క్‌) మరియు రిటైలర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌ఏఐ) భాగ స్వామ్యంతో ‘మెమోరండం ఆఫ్‌ అండర్స్టాండిరగ్‌ (ఎంఓయు)’ కుదుర్చు కున్నట్లు ప్రకటించడం గర్వంగా ఉంది. వరల్డ్‌ యూత్‌ స్కిల్‌ డే సంద ర్భంగా, ఈ సంచలనాత్మక భాగస్వామ్యంలో ‘‘రత్నదీప్‌ రిటైల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌’’ను స్థాపించడం లక్ష్యంగా పెట్టుకుంది మరియు ఇది రిటైల్‌ పరిశ్రమలో యువ ఔత్సాహికులకు సమగ్ర నైపుణ్యాభివృద్ధి అవకా శాలను అందిస్తుంది. హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో మల్లా రెడ్డి, తెలంగాణ కార్మిక, ఉపాధి శాఖ మంత్రి – శ్రీకాంత్‌ సిన్హా, టాస్క్‌ సిఇఒ – జయేష్‌ రంజన్‌, పరిశ్రమలు ,వాణిజ్యం (ఐ అండ్‌ సి) మరియు ఐటి శాఖల ప్రిన్సిపల్‌ సెక్రటరీ – తెలంగాణ ప్రభుత్వం, రత్నదీప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ – యష్‌ అగర్వాల్‌ వంటి ప్రముఖుల సమక్షంలో ఈ ఎంవోయూ మార్పిడి జరిగింది. ఈ రత్నదీప్‌ రిటైల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌, శిక్షణ, నైపుణ్యం పెంపుదల మరియు విజ్ఞాన కేంద్రంగా పనిచేస్తూ, రిటైల్‌ రంగం యొక్క అభివృద్ధికై కావాల్సిన అవసరాలను తీర్చేందుకు కృషి చేస్తుంది. డైనమిక్‌ రిటైల్‌ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి అవసరమైన నైపుణ్యం మరియు విజ్ఞానాన్ని అందిస్తూ, ఔత్సాహిక వ్యక్తులను సన్నద్ధం చేయడమే లక్ష్యంగా, రత్నదీప్‌, తెలంగాణ ప్రభుత్వం, టాస్క్‌ మరియు ఆర్‌ఏఐ యొక్క భాగస్వామ్యం పనిచేస్తుంది. రత్నదీప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, శ్రీ యష్‌ అగర్వాల్‌, ఈ భాగస్వామ్యం గురించి తన మాట్లాడుతూ, ‘‘రత్నదీప్‌ రిటైల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్ని స్థాపించడానికి తెలంగాణ ప్రభుత్వం, టాస్క్‌ మరియు ఆర్‌ఏఐ తో చేతులు కలపడం మాకు చాలా ఆనందంగా ఉంది. దీని యొక్క స్థాపన రిటైల్‌ పరిశ్రమలో ప్రతిభను పెంపొందించడం మరియు నైపు ణ్యాభివృద్ధిని ప్రోత్సహించాలనే రత్నదీప్‌ ఆశయాలకు అనుగుణ మైనది. అలానే ఈ భాగస్వామ్యం రిటైల్‌ పరిశ్రమలో విలువైన నైపుణ్య శిక్షణను అందించాలనే మా ఆశయాన్ని పటిష్టం చేస్తుంది. అయితే ఒక సంవత్సర కాలంలోనే 10,000 వ్యక్తులు, రిటైల్‌ రంగంలో వారి భవిష్యత్తును విజయవంతంగా తీర్చిదిద్దుకునే విధంగా, వారికి తగిన నైపుణ్యాన్ని మరియు విజ్ఞానాన్ని అందించడమే మా లక్ష్యం.’’
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు