Saturday, May 18, 2024

గంజాతో దొరిగిన అమెరికన్ సూపర్ మోడల్..

తప్పక చదవండి
  • ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మోడల్ జిగి హడిద్‌..
  • అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచిన పోలీసులు..
    విమానాశ్రయంలో గంజాతో పట్టుబడిన అమెరికన్‌ సూపర్‌ మోడల్‌ అమెరికాకు చెందిన సూపర్‌ మోడల్‌ జిగి హడిద్‌ యూకేలోని ఓ విమానాశ్రయంలో డ్రగ్స్‌తో పట్టుబడింది. 28 ఏండ్ల గిగి తన స్నేహితురాలు నికోల్‌ మెక్‌కార్టీతో కలిసి అమెరికా నుంచి ప్రైవేట్‌ విమానంలో యూకేలోని కైమన్‌ ద్వీపానికి చేరుకున్నది.
    ఈ సందర్భంగా ఓవెన్‌ రాబర్ట్స్‌ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేయగా గంజాయి దానిని తాగడానికి ఉపయోగించే వస్తువులు ఆమె వద్ద లభించాయి. దీంతో వారిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. నేరాన్ని ఒప్పుకోవడంతో న్యాయమూర్తి వారికి వెయ్యి డాలర్లు జరిమానా విధించారు. అనంతరం వారికి బెయిల్‌ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. కాగా, గంజాను వ్యక్తిగతంగా వినియోగించడానికే తీసుకొచ్చినప్పటికీ.. దానిని దిగుమతి చేయడం, గంజా తాగడానికి ఉపయోగించే పాత్రలను తీసుకురావడం వంటి ఆరోపణలపై అమెరికన్‌ సూపర్‌ మోడల్‌ను అరెస్టు చేసినట్లు తెలుస్తున్నది.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు