Monday, February 26, 2024

తెలంగాణ రైతుల‌ను నిండా ముంచాడు..

తప్పక చదవండి
  • ఒకవైపు వరదలు.. మరోవైపు కేసీఆర్‌ పట్టి పీడిస్తున్నారు..
  • తీవ్ర విమర్శలు చేసిన కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు కిష‌న్‌రెడ్డి..
  • మభ్యపెట్టే మాటలు తప్ప చేతులుండవు..
  • శామీర్ పేట్ లో ప్రధాన మంత్రి సమృద్ధి యోజనా సేవా కేంద్ర ప్రారంభం..

రైతుల‌ను మ‌భ్య‌పెట్టే మాట‌లే త‌ప్ప చేత‌లుండ‌ని ప్ర‌భుత్వం బీఆర్ఎస్ ప్ర‌భుత్వమ‌ని కేంద్ర మంత్రి, భార‌తీయ జ‌న‌తా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడు కిష‌న్‌రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌ధాన మంత్రి కిసాన్ సమృద్ధి యోజ‌న సేవా కేంద్రం ప్రారంభోత్స‌వంలో భాగంగా గురువారం శామీర్‌పేట‌లోని మ‌న‌ గ్రోమోర్‌లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు కిషన్ రెడ్డి..

ఈ సంద‌ర్భం ఆయ‌న మాట్లాడుతూ… కేసీఆర్ ఏమి చెప్ప‌ద‌లుచుకున్నా.. ఏం చేయ‌ద‌లుచుకున్నా… ఫౌం హౌస్‌లోనే ప్రణాళిక‌లు త‌యారవుతాయ‌ని, రైతు ప్ర‌భుత్వం అంటూ మాట‌లు చెప్పే కేసీఆర్.. కేవలం కల్లబొల్లి మాట‌లు చెబుతూ రైతుల‌ను న‌య‌వంచ‌న‌కు గురిచేస్తూ రాజ్య‌మేలుతున్నాడ‌ని అగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. రైతు ప్ర‌భుత్వ‌మంటూ రాజ్య‌మేలే కేసీఆర్ భూట‌క‌పు మాట‌ల‌తో ఆ రైతుల‌నే న‌య‌వంచ‌న‌కు గురిచేస్తున్నాడ‌ని అన్నారు.. ప్ర‌గ‌తి భ‌వ‌న్ కేవ‌లం క‌ల్వ‌కుంట్ల కుటుంబానికే నిల‌యంగా మారింద‌ని, ఏ ఒక్క‌రినీ రానీయ‌క‌పోవ‌డానికి కార‌ణాలేమిటో చెప్పాల‌ని, ఇదంతా యావ‌త్తు తెలంగాణ‌ ప్ర‌జానికం గ‌మ‌నిస్తోంద‌ని, త్వ‌ర‌లోనే కేసీఆర్ కుటుంబానికి ప్ర‌జ‌లే త‌గిన‌ గుణ‌పాఠం చెబుతార‌ని తీవ్రంగా హెచ్చరించారు.. తెలంగాణ‌లో బాబాసాహేబ్ అంబేధ్క‌ర్ రాజ్యాంగం న‌డవ‌డం లేద‌ని, న‌యానిజాం క‌ల్వ‌కుంట్ల రాజ్యాంగ‌మే న‌డుస్తోంద‌ని ఎద్దేవా చేశారు. రైతుల‌కు 24 గంట‌ల క‌రెంటు ఇస్తున్నామ‌ని చెబుతూ మోసం చేస్తున్నార‌ని ఆరోపించారు.. 2016 ఎన్నిక‌లలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క‌టి నెర‌వేర్చ‌లేద‌ని, అన్ని బూట‌క‌పు మాట‌లే మాట్లాడుతూ తెలంగాణ ప్ర‌జ‌ల‌ను న‌య‌వంచ‌న‌కు గురిచేస్తున్నాడ‌ని నిప్పులు చెరిగారు. రైతుల‌పై ప్రేమ ఉన్న ప్ర‌భుత్వం కేవ‌లం భార‌తీయ జ‌న‌తా పార్టీయేన‌ని, ఎరువుల‌పై రైతుల కోసం రూ.1060 స‌బ్సిడీ ఇస్తున్న ఘ‌న‌త త‌మ‌కే ద‌క్కుతుంద‌న్నారు. రైతు కేవ‌లం రూ.290 మాత్ర‌మే చెల్లించి వారికి కావ‌ల్సిన ఎరువుల సంచిని ఇంటికి తీసుకెల్లోచ్చ‌ని, రైతులకు ఇబ్బందులు లేకుండా పండించిన పంట‌ను కూడా కేంద్ర ప్ర‌భుత్వ‌మే కొనుగోలు చేస్తుంద‌న్నారు.

- Advertisement -

అనంత‌రం దుబ్బాక ఎమ్మెల్యే రంఘునంద‌న్‌రావు మాట్లాడుతూ.. న‌రేంద్ర‌ మోడీ ల‌క్ష్యం చిన్న, స‌న్న‌కారు రైతుల‌ను సైన్స్ అండ్ టెక్నాల‌జీతోటి అనుసంధానం చేయ‌డ‌మేన‌న్నారు. మ‌నిషికైతే హెల్త్ కార్డు ఎలా ఉంటుందో పంట పొలాల‌కు కూడా సాయిల్ హెల్త్ కార్డుల‌ను కేంద్రం ప్ర‌భుత్వం అందిస్తోంద‌న్నారు. రైతు పండించే భూమిలో ఏ పంట వేయాలి, ఎలాంటి ఎరువులు ఎంత మోతాదులో వాడాల‌నే అంశాల‌ను ఈ సాయిల్ హెల్త్ కార్డుతో రైతుల‌కు మేలు జ‌రుగుతుంద‌న్నారు. తెలంగాణ రాష్ట్రంలోని రైతుల‌కు సాయిల్ హెల్త్ కార్డులు ఇవ్వాల‌ని కేంద్రం ప్ర‌భుత్వం 7 ఏళ్ళ నుంచి చెబుతున్నా ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రం ప్ర‌భుత్వం రైతుల‌కు అందింక‌చ‌క‌పోవ‌డం వారిని మోసం చేస్తుంద‌న‌డానికి నిధ‌ర్శ‌న‌మ‌న్నారు. రైతుల కోసం రైతు వేదికలు నిర్మించామ‌ని చెబుతున్నా అవి కేవ‌లం ప్ర‌తి ప‌క్షాల‌ను తిట్ట‌డానికి, పార్టీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించుకోవ‌డానికే వినియోగిస్తున్నారే త‌ప్ప, రైతు సంక్షేమం కోసం ఏనాడైనా అధికారుల‌తో కార్య‌క్ర‌మాలు చేప‌ట్టి, పంట‌ల అభివృద్దిపై చ‌ర్చ‌లు జ‌రిపారా అని ప్రశ్నిస్తూ ఈ విష‌యంలో స్వేత ప‌త్రం విడుద‌ల చేసే ద‌మ్ముందా అంటు స‌వాల్ విసిరారు. ఈ కార్య‌క్ర‌మంలో బుద్ధి శ్రీనివాస్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, వంగ‌రి హృద‌య్‌కుమార్‌, నూనె ముంతల రవీంద‌ర్‌, బొట్టుయాదగిరి, రాజు, యాదగిరి, గణేష్, ముకుడిగాళ్ళ మహేందర్, ఎంపీటీసీ శోభా రెడ్డి, వార్డు స‌భ్యుడు సాయిబాబా, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు