- మానవతా కోణంలో ఆదుకోవాలని వేడుకోలు..
వివిధ పరీక్షల నడుమ తక్కువ వ్యవద్ది ఉన్నందువలన గురుకుల పరీక్షలు, జేఎల్ పరీక్షలు నిర్వహించిన తర్వాత గ్రూపు-2 నిర్వహించమని, గ్రూప్ -2 ని 2-నెలలు వాయిదా కోరుతూ నిరుద్యోగులు గురువారం రోజు ఎమ్మెల్సీ కవితని, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని, పల్ల రాజేశ్వర రెడ్డిని, విప్ బాల్క సుమన్ ని కలిసి వినతపత్రం అందజేశారు. ఆగస్ట్ 1- 23వ తేదీల వరకు గురుకుల టీచర్ పరీక్షలు ఉన్నాయని.. అది ముగిసిన 5 రోజులలో గ్రూప్- 2 పరీక్ష ఉందని.. అలాగే గ్రూప్ – 2 పరీక్ష ముగిసిన 3 రోజుల్లో రోజుల్లో జేఎల్ పరీక్షలు ప్రారంభము అవుతున్నాయని.. ఇలా 3- ప్రధాన పరీక్షల మధ్య సమయం లేకపోవడం వల్ల తామంతా మానసికంగా ఆందోళన చెందుతున్నామని నిరుద్యోగులు మొర పెట్టుకున్నారు.. మానవతా కోణంలో ఆలోచించి గడువు పొడిగించాలని విజ్ఞప్తిని చేసారు.. దానికి వారు స్పందిస్తూ ఈ యొక్క విన్నపాన్ని పరిశీలిస్తామని తగు విధంగా న్యాయం చేస్తామని తెలిపినారు..