Monday, May 6, 2024

ముగిసిన ప్రధాని ఫ్రాన్స్ పర్యటన..

తప్పక చదవండి
  • యూఏఈ చేరుకున్న ప్రధాని మోదీ
  • ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు
  • స్థానిక కరెన్సీలో వాణిజ్యం ఒప్పందంపై సంతకాలు

ఫ్రాన్స్ పర్యటన ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ యూఏఈ చేరుకున్నారు. శనివారం యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఇరువురి మధ్య భారత్-యూఏఈ దైపాక్షిక సంబంధాలు చర్చకు వచ్చాయి. ఇద్దరు నేతలు వివిధ రంగాలకు చెందిన అంశాలపై లోతుగా చర్చించారు. అల్ నహ్యాన్ తో భేటీ అనంతరం ప్రధాని మోదీ స్పందిస్తూ… యూఏఈ పాలకుడితో చర్చలు అర్థవంతంగా జరిగాయని పేర్కొన్నారు. యూఏఈతో వ్యాపార సంబంధాలు మరింత వృద్ధి చెందినట్టు భావిస్తున్నామని తెలిపారు.

ఇకపై యూఏఈ, భారత్ మధ్య వాణిజ్యం స్థానిక కరెన్సీలోనే జరిగేలా ఓ అంగీకారానికి వచ్చామని వివరించారు. ఈ ఒప్పందం ద్వారా యూఏఈతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయని తెలిపారు. స్థానిక కరెన్సీలో లావాదేవీల ద్వారా ద్యైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులకు మరింత ఊతం లభిస్తుందని మోదీ పేర్కొన్నారు. గతేడాది భారత్-యూఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు చేశాయని, అప్పటి నుంచి భారత్-యూఏఈ మధ్య వాణిజ్యం 20 శాతం వృద్ధి చెందిందని ప్రధాని మోదీ వెల్లడించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు