Monday, October 14, 2024
spot_img

పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య సంచలన నిర్ణయం..!

తప్పక చదవండి

బయట ఫ్యాన్స్ మధ్య గొడవలు ఉంటాయి.. కానీ లోపల ఇండస్ట్రీలో హీరోల మధ్య మాత్రం మంచి స్నేహం ఉంటుంది. మరీ ముఖ్యంగా బాలకృష్ణతో అందరు హీరోలు సన్నిహితంగానే ఉంటారు. ఈ మధ్య మెగా హీరోలతో కూడా బాలయ్యకు దోస్తానా ఎక్కువైపోయింది. అన్ స్టాపబుల్ మొదలైన తర్వాత అందరివాడు అయిపోయాడు బాలకృష్ణ. ఈ క్రమంలోనే తాజాగా పవన్ కళ్యాణ్ కోసం తన సినిమా విషయంలో ఒక ఆసక్తికరమైన నిర్ణయం బాలకృష్ణ తీసుకున్నట్టు తెలుస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈయన నటిస్తున్న సినిమాకు బ్రో ఐ డోంట్ కేర్ అనే టైటిల్ పెట్టాలి అనుకున్నారు. అప్పట్లో ఈ టైటిల్ కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.

పైగా బాలకృష్ణ ఆటిట్యూడ్ కు ఇది సరిగ్గా సరిపోతుందని అభిమానులు కూడా పండగ చేసుకున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఈపాటికి సినిమా టైటిల్ కూడా అనౌన్స్ చేసి ఉండేవాళ్లు. కాకపోతే మధ్యలో పవన్ కళ్యాణ్ సినిమాకు బ్రో టైటిల్ కన్ఫర్మ్ చేశారు. సముద్రఖని దర్శకత్వంలో నటిస్తున్న ఈ సినిమా జులై 28న విడుదల కానుంది. ఆల్రెడీ పవన్ సినిమాకు బ్రో అనే టైటిల్ పెట్టడంతో.. తన సినిమాకు మళ్ళీ అదే పెడితే బాగోదు అని బాలకృష్ణ టైటిల్ విషయంలో వెనక్కి తగ్గాడు. అనిల్ రావిపూడి కూడా ఈ విషయంలో బాలయ్యకు తగ్గ టైటిల్ కోసం చాలా వెతుకుతున్నాడు. ఈ నేపథ్యంలోనే మోనార్క్ అనే టైటిల్ వైపు ఆసక్తిగా గమనిస్తున్నాడు ఈ దర్శకుడు. సుస్వాగతం సినిమాలో నేను మోనార్క్ ను నన్నెవరూ మోసం చేయలేదు అంటూ ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగ్ చాలా పాపులర్ అయింది. పైగా ఆ క్యారెక్టర్ కూడా ఎలా ఉంటుందో క్లారిటీ ఉంది. ఇప్పుడు బాలయ్య సినిమాకు ఇదే టైటిల్ పెడితే ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో అభిమానులకు ముందుగానే ఒక బొమ్మ కనిపిస్తుంది.

- Advertisement -

జూన్ 10న బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్లస్ టైటిల్ విడుదల కానుంది. అయితే మోనార్క్ తో పాటు భగవంత్ లాల్ కేసరి అనే మరో టైటిల్ కూడా తెరపైకి వచ్చింది. ఇందులో బాలకృష్ణ క్యారెక్టర్ పేరు ఇదే. తెలంగాణ నేపథ్యంలో ఈ సినిమా వస్తుంది. దసరాకు విడుదల కానున్న ఈ సినిమాలు బాలయ్య తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడబోతున్నాడు. మొత్తానికి పవన్ కళ్యాణ్ కోసం తన సినిమా టైటిల్ వదిలేసుకున్నాడు బాలకృష్ణ.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు