Friday, October 11, 2024
spot_img

ప్రభాస్‌ తో కలిసి నటించనున్న కమల్‌ హాసన్‌..?

తప్పక చదవండి

ప్రభాస్ నటిస్తోన్న పాన్ ఇండియా సినిమాల్లో ప్రాజెక్ట్‌ కె ఒకటి . సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మహానటి ఫేం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇప్పటికే ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌ వంటి స్టార్స్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో స్టార్‌ నటుడు ప్రాజెక్ట్‌ కె లో భాగం కానున్నట్లు తెలుస్తోంది

విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ ‘ప్రాజెక్ట్‌ కె’ లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఈ చిత్రంలో కమల్‌ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. సినిమాలో ఆయన కనిపించేది కేవలం 30 నిమిషాలు మాత్రమే అని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇంకో విషయం ఏంటంటే.. ప్రతినాయకుడి పాత్రకు కమల్‌ ఏకంగా రూ.150 కోట్ల వరకు రెమ్యూనరేషన్‌ తీసుకోనున్నట్లు కోలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది.

- Advertisement -

ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె , దిశా పటానీ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే సగానికిపైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాని.. 2024 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. అక్టోబర్‌ కల్లా ప్రొడక్షన్‌ పనులను పూర్తి చేసి అనుకున్న టైమ్‌ లైన్‌ ప్రకారం సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారా..? అనేది చూడాలంటున్నారు సినీ జనాలు. ఇక ప్రస్తుతం ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’లో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా జూన్‌ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్‌ మరోవైపు ప్రశాంత్‌ నీల్ డైరెక్షన్‌లో నటిస్తున్న ‘సలార్‌’ షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నాడు. దీంతోపాటు మారుతి హార్రర్ కామెడీ ప్రాజెక్ట్‌ కూడా సెట్స్‌ పై ఉంది

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు