Thursday, May 16, 2024

అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు..

తప్పక చదవండి

ఉస్మానియా యూనివర్సిటీలో జరగబోయే రెండవ, నాలుగవ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్డుల అధ్వర్యంలో రోడ్ పై బైఠాయించి శాంతి యుతంగా నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉండగా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి విద్యార్థులను ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.. ఈ అక్రమ అరెస్ట్ లను విద్యార్ది లోకం తీవ్రంగా ఖండిస్తుంది. తరగతులు నిర్వహించకుండ పరీక్షలు జరపడం చాలా బాధాకరం అని తెలియచేశారు. యూజీసీ నిబంధనలను తుంగలో తొక్కుతూ ఇష్టనుసారంగా పరీక్షలు నిర్వహించడం సిగ్గు చేటు. ఇంతటితో ఈ పరీక్షలు వాయిదా వేయక పోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని విద్యార్ది నాయకులు హెచ్చరించారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు