Saturday, April 20, 2024

ఆన్ లైన్ పెట్టుబడి పేరుతో భారీ స్కాం..

తప్పక చదవండి

సైబ‌ర్ నేరాల‌పై ప్ర‌భుత్వం, పోలీసులు ప్ర‌జ‌ల్లో ఎంత‌గా అవ‌గాహ‌న పెంచుతున్నా ఆన్‌లైన్ వేదిక‌గా అమాయాకులే టార్గెట్‌గా సైబ‌ర్ నేర‌గాళ్లు చెల‌రేగుతున్నారు. తాజాగా టెలిగ్రాంలో ఇన్వెస్ట్‌మెంట్ ఆఫ‌ర్ పేరుతో ముంబైకి చెందిన ఓ వ్య‌క్తి నుంచి స్కామర్లు రూ. ల‌క్ష కొట్టేశారు. ఆన్‌లైన్‌లో ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్ గురించి ఆరా తీస్త‌న్న ముంబై న‌గ‌రంలోని ప‌న్వేల్‌కు చెందిన 27 ఏండ్ల యువ‌కుడిని స్కామ‌ర్లు బోల్తా కొట్టించారు.

ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్‌లో పెట్టుబ‌డి పెడితే భారీ రిటన్స్ వ‌స్తాయ‌ని టెలిగ్రాం యాప్‌లో బాధితుడిని స్కామ‌ర్లు న‌మ్మ‌బ‌లికారు. బాధితుడిని ముందుగా రూ. 1000 ఇన్వెస్ట్ చేయాల‌ని కోరిన నేర‌గాళ్లు అత‌డు ఆ మొత్తం ఇన్వెస్ట్ చేసిన వెంట‌నే బాధితుడి టెలిగ్రాం ఖాతాలో రూ. 1620 బ్యాలెన్స్ చూపింది. ఇన్వెస్ట్‌మెంట్‌పై బాధితుడు ఏకంగా రూ. 620 ఆర్జించ‌డంతో స్కామ‌ర్లు అత‌డి న‌మ్మ‌కం చూర‌గొన్నారు.

- Advertisement -

ఆపై రూ. ల‌క్ష ఇన్వెస్ట్ చేయాల‌ని స్కామ‌ర్లు కోర‌గా అత‌డు అంతే మొత్తం పెట్టుబ‌డి పెట్ట‌గా బాధితుడి టెలిగ్రాం ఖాతా బ్యాలెన్స్ ఏకంగా రూ . 2.2 ల‌క్ష‌లు చూపింది. దీంతో బాధితుడు టెలిగ్రాం ఖాతా నుంచి త‌న బ్యాంక్ ఖాతాకు సొమ్మును బ‌దిలీ చేసుకునేందుకు ప్ర‌య‌త్నించ‌గా అది సాధ్యం కాలేదు. తాను మోస‌పోయాన‌ని గ్ర‌హించిన బాధితుడు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఈ వ్య‌వ‌హారం వెలుగుచూసింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు