సుఖ్ దేవ్ థాపర్ భారత స్వాతంత్య్ర ఉద్యమకారుడు. ఇతను భగత్ సింగ్ మరియు రాజ్‌గురుల సహచరుడు.1928లో లాలా లజపతి రాయ్ మరణానికి కారణమైన బ్రిటిష్ ప్రభుత్వం పై పగతీర్చుకోవడానికి, ఫిరోజ్ పూర్ లో బ్రిటిష్ పోలీసు అధికారి ‘‘జె.పి. సాండర్స్’’ ను హతమార్చినందుకుగాను మార్చి 23 1931 న ఉరితీయబడ్డాడు.24 ఏళ్ల వయసులోనే భారతదేశ స్వేచ్ఛా, స్వాతంత్య్రాల కోసం ఉరితాడును ముద్దాడాడు. సుఖ్‌దేవ్ 1907 మే 15 న బ్రిటీష్ రాజ్‌లోని పంజాబ్‌లోని లూథియానాలో రామ్‌లాల్ థాపర్ మరియు రల్లీ దేవి దంపతులకు జన్మించాడు. పండిట్ రామప్రసాద్ బిస్మిల్, చంద్రశేఖర ఆజాద్‌ల ప్రభావం సుఖదేవ్‌పై బలంగా ఉండేది.భగత్ సింగ్ , రాజ్ గురు, సుఖ్ దేవ్ లను 1931 మార్చి 23న లాహోరు జైలులో సాయంత్రం 7.33 నిమిషాలకు ఉరి తీశారు. అప్పటి నిబంధనల ప్రకారం ఆ సమ యంలో ఉరి శిక్ష అమలు జరపకూడదు కాని బ్రిటీష్ ప్రభుత్వ కుటిల నీతి కారణంగా. వారి మృత దేహాలను రహస్యంగా, జైలు గోడలు పగులగొట్టి తీసికొని వెళ్ళి సట్లెజ్ నది తీరాన హుస్సేన్ వాలా అనే ఊరిలో దహనం చేశారు. మృత దేహాలను చూసిన ప్రజలలో అలజడిని ఎదుర్కోకుండా ఇలా చేశారు.సుఖదేవ్ హిం దూస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ సంస్థలో ముఖ్యమైన నాయకుడు. లాహోర్ నేషనల్ కాలేజిలో భారత పురాతన ఔన్న త్యాన్ని అధ్యయనం చేయడానికి, ప్రపంచ విప్లవ పరిణా మాలు పరిశీలించడానికి ఒక అధ్యయన కేంద్రాన్ని ప్రారంభిం చాడు. తన సహచరులైన భగత్ సింప్‌ా, భగవతీ చరణ్ వోహ్రా లతో కలిసి లాహోరులో నవ జవాన్ భారత సభ ప్రారంభిం చాడు. దేశ స్వాంతంత్య్రానికి యువతను ఉత్తేజితులను చేయడం, సమరసత ను, స్వాతంత్య్ర చైతన్యంను రగిలించడం, అంటరాని తనాన్ని అరికట్టడం ఆసంస్థ ఆశయాలు. ఖైదీలపట్ల చూపుతున్న అమా నుష విధానాలకు వ్యతిరేకంగా 1929లో జరిగిన నిరాహార దీక్షలో సుఖదేవ్ పాల్గొన్నాడు. సుఖదే వ్ ఎప్పుడూ నిశ్చింతగా ఉండే వాడు. ఏదైనా ఒక విషయం మనసుకు పడితే ఇక పరిణా మాలు ఆలోచించకుండా అందులో దూ కే వాడు. స్నేహితులు ఈ విష యంలో వెక్కిరిస్తూ ఉండేవారు.. ఎవరినైనా ముక్కు మీద కొడితే వారు మనఆధీనంలోకి వస్తారని అతను ఒకసారి ఎక్కడో చది వాడు. ఇక దానిని పరీక్ష చేయాలని అనుకున్నాడు. దారిలో వెళుతూ తనకు ఎదురొచ్చిన ఒక పహిల్వాన్ ముక్కు మీద పిడి గుద్దు లు కురిపించాడు. అతను వెంటనే రెండు చేతులతో తల పట్టుకుని పడిపోయాడు. సుఖదెవ్ అతనిని చూస్తూ అక్కడే నుంచుని ఉన్నా డు. తర్వాత కాసేపటికి పహిల్వాన్ తెలివి తెచ్చు కొని చూసేసరికి తనని కొట్టిన వాడు ఎదురుగానే నిలబడి చూస్తున్నా డు. అతను ఒక్కసారిగా కోపంతో సుఖదేవ్ మీదపడి విపరీతంగా కొట్టాడు. కానీ సుఖ దేవ్ అతనిని కాస్త కూడా ఎదిరించ లేదు. చుట్టుపక్కల వాళ్ళు పోగయ్యి ఇద్దరినీ విడిపించారు. అందరూ సుఖదేవ్‌ని’ పహి ల్వాన్ పడిపోగానే పారిపోక ఎందుకు నుంచుని చూస్తున్నావ్’ అని అడిగారు. దానికి సుఖ దేవ్ ‘‘ముందు నేను అతన్ని కొట్టాను కదా, ఇపుడు అతను నన్ను కొడుతున్నాడుఅంతే అని తాపీగా సమా ధానం చెప్పాడు. ‘‘అసలు ఒక్క దెబ్బతో ఒక వ్యక్తి ఎంత సేపు మూర్ఛలో ఉంటాడో చూడటానికే ఇక్కడే నుంచుని చూస్తున్నా ను ‘‘అని అన్నాడు. సాండర్స్ హత్య తర్వాత భగత్ సింగ్, రాజ్ గురు లను సురక్షితంగా తప్పించి, పోలీసు లకు టోకరా ఇచ్చి తనుకూడ కాన్పూర్ చేరుకున్నాడు. అక్కడి నుండి ఆగ్రా వెళ్ళాడు. అక్కడ మళ్ళీ భగత్ సింగ్ వచ్చి కలిశాడు. ఇద్దరూ కలిసి అక్కడ యతింద్ర నాథ్ దాస్ దగ్గర బాంబులు తయారు చేయ డంలో శిక్షణ పొం దారు. తిరిగి లాహోర్ వచ్చిగుజర్ సింగ్ కోట దగ్గర కాశ్మీర్ బిల్డింగ్ అద్దెకు తీసు కొని బాంబుల కేం ద్రాన్ని ఏర్పాటు చేశాడు. తరువాత కాలంలో జైలులో ఉన్నపుడు కూడా అతను ఎప్పుడూ కులాసాగా సం తోషంగా ఉండేవాడు. చివరికి 1930 అక్టోబరు 7నభగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్‌లకు ఉరి శిక్ష ఖరారు చేసారు. జైలు బయట ప్రజలు దీనికి వ్యతిరేకంగా ఎంతో ఆందోళనలు చేశారు. సుఖదేవ్ జైలు నుండి తన సందేశం పంపి ంచాడు. నిజానికి మా ఉరి శిక్ష లను మార్చడం వలన జరిగే మేలు కంటే మేము ఉరి కంబం ఎక్కడం వల్లనే దేశానికి ఎక్కువ ప్రయోజనం ఉంటుందని’’ చెప్పాడు. సుఖదేవ్‌ను ఉరితీసే ముందు అతను మహాత్మా గాంధీకి ఒక లేఖ వ్రాశాడు. విప్లవ మార్గంలో ఉద్యమి స్తున్న వారిపట్ల మహాత్మా గాంధీ అనుసరిస్తున్న ప్రతికూల ధోరణి ని ఈ లేఖలో సుఖదేవ్ విమర్శించాడు. సుఖదేవ్ కు ఉరి శిక్ష వేయడానికి ఆధారమైన ప్రధాన సాక్ష్యం హంసరాజ్ వోహ్రా ఇచ్చాడు. అయితే సుఖదేవ్ స్వయంగా నేరాన్ని అంగీకరిం చాడని వోహ్రా చెప్పాడు. ఉరికం బందగ్గరకు తీసుకు వచ్చిన పుడు సంతో షంగా పెద్దగా ‘‘ఇంక్వి లాబ్ జిందాబాద్’’, అని నినా దాలు చేశాడు. దానితోపాటు ‘భగత్ సింగ్ జిందాబాద్’, ‘రాజ్ గురు జిందాబాద్’ అని కూడా అరిచాడు. ఎంతో ప్రేమతో ఉరికం బాన్ని చూస్తూ, ఆ తాడుని ముద్దు పెట్టుకొని, స్వయంగా తన చేతులతో మెడకి తగిలించుకుని బలిదానం కోసం ముందుకి నడిచాడు.