Tuesday, June 25, 2024

100 శాతం వృద్ధి రేటుతో ఓడిన్‌స్కూల్‌ ప్రభంజనం…

తప్పక చదవండి
  • వంద శాతానికి పైగా ఇయర్‌ ఆన్‌ ఇయర్‌ వృద్ధి రేటు నమోదు చేసిన ఓడిన్‌స్కూల్‌
  • దేశంలోని సాంకేతిక రంగంలో కొరవడిన నైపుణ్య సమస్యలను పరిష్కరించనున్న
  • ‘డేటా సైన్స్‌ అండ్‌ వెబ్‌ డెవలప్‌మెంట్‌’ వంటి అప్‌స్కిల్లింగ్‌ వేదికలు..
    హైదరాబాద్‌ : ప్రముఖ ఆన్‌ లైన్‌ అప్‌స్కిల్లింగ్‌ వేదిక అయినటువంటి ఓడిన్‌స్కూల్‌ 100 శాతా నికి పైగా ఇయర్‌ ఆన్‌ ఇయర్‌ వృద్ధిని నమోదు చేసింది. 2021 మే నెలలో ప్రారంభమైన ఈ వేదిక అతితక్కువ కాలంలోనే అత్యు త్తమ వైఓవై వృద్ధిని సాధించింది. సాంకేతిక విద్యలో భవిష్యత్‌ పరిణామానాలపై ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్న తరుణంలో ఈ వృద్ధి రేటు కీలకమైన విజయం. దేశవ్యాప్తంగా ఓడిన్‌స్కూల్‌ ఆధ్వర్యంలోని డేటా సైన్స్‌, వెబ్‌ డెవలప్‌మెంట్‌ ‘బూట్‌క్యాంప్‌’లకు గత రెండు సంవత్సరాల వ్యవధిలో రెట్టింపు ఆదరణ పెరిగింది. దీనితో పాటుగానే కంపెనీ పరిమాణం, ఉద్యోగుల సంఖ్య కూడా గత ఏడాదికంటే రెట్టింపు దిశలో కొనసాగుతుంది. ప్రస్తుతం ఓడిన్‌స్కూల్‌ వేదికలో విభిన్న రంగాలకు చెందిన 3 వేలకు పైగా ఔత్సా హికులు శిక్షణ పొందుతున్నారు. ఈరంగంలో పైపుణ్యాల ను పెంచుకోవాలనుకునే కొత్తవారు, అను భవజ్ఞులైన నిపుణులు, సాంకేతిక నిపుణులు, మరింత మెరుగైన భవిష్యత్‌ అవకాశాలకు ప్రయ త్నిస్తున్న వారు, నాన్‌-టెక్నాలజీ రంగాలకు చెందినవారు, కొంత విరామం తర్వాత మళ్లీ ఈ రంగం లో రాణించా లనుకునే మహిళలు… ఇలా విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన ఔత్సాహికులు ఓడిన్‌ స్కూల్‌ అందిస్తున్న డేటా సైన్స్‌, వెబ్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రా మ్‌లను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భం గా ఓడిన్‌స్కూల్‌ సీఈవో విజయ్‌ పసుపులేటి మాట్లాడుతూ., ‘‘అంతర్జాతీయ సాంకేతిక రంగంలో (గ్లోబల్‌ టెక్నాలజీ) టాలెంట్‌ హబ్‌గా కొనసాగుతున్న భారత్‌ ‘అధునాతన నైపుణ్యాలను’ అంది పుచ్చు కోవడంలో గణనీ యమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈలోటును పూడ్చడంతో పాటు పరిశ్రమ అవసరమైన నైపుణ్యాలకు అందించడానికి సమాంతరమైన వేదికను ప్రారంభించాం. ప్రారంభం నుంచే మా బూట్‌క్యాంప్‌ల ద్వారా కెరీర్‌ అవకాశాలను మెరుగుపరుచు కోగలిగిన గ్రాడ్యు యేట్లు, నిపుణుల నుంచి ఊహించని ఆదరణ, స్పందనను సాంపాదించాం. అంతే కాకుండా పరిశ్రమలో గట్టి పోటీని కొనసాగిం చగలిగాము. ఈకోర్సులకు అభ్యర్థుల నుంచి వచ్చిన స్పందన దృష్ట్యా రానున్న 3 నెలల్లో డిజిటల్‌ మార్కెటింగ్‌, క్లౌడ్‌ టెక్నాలజీ వంటి ఇతర టెక్నాలజీ డొమైన్‌లలో కొత్త ఆఫర్‌లకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నాం. ఈప్రయత్నాలు పరిశ్రమను పురోగతిదిశలో తీసుకువెళ్లడమే కాకుండా అధునాతన సంకేతికతల్లోని సమస్యలను పరిష్కరిస్తూ, నైపుణ్యాల లోటును తగ్గించడంలో గణనీయం గా దోహదపడుతుంది. ఈపరిణామాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని’’ ఆయన తెలిపారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు