Sunday, September 8, 2024
spot_img

అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్‌ ..

తప్పక చదవండి
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ఏపీ డీఎంఈ నోటిఫికేషన్‌
  • ఏపీ డీఎంఈ పరిధి లోని కార్డియాలజీ,
    ఎండోక్రైనాలజీ, మెడికల్ జీఈ, నియోనాటాలజీ, నెఫ్రాలజీ, న్యూరో సర్జరీ, న్యూరాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, సర్జికల్ జీఈ, సర్జికల్ అంకాలజీ, యూరాలజీ, వాస్కులర్ సర్జరీ, అనస్థీషియా, డెర్మటాలజీ త‌దిత‌ర విభాగాల‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భ‌ర్తీకి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 590 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు డీఎం, ఎండీ, ఎంఎస్‌, డీఎన్‌బీ, డీఎంఏ ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. దరఖాస్తు విధానం ఆన్‌లైన్‌లో ఉండ‌గా.. జూలై 26 వ‌రకు అప్ల‌య్ చేసుకోవ‌చ్చు. పీజీ ఫైనల్ ప‌రీక్ష‌ ఉత్తీర్ణ‌త, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ద్వారా ఎంపిక ఉంటుంది.
    మొత్తం పోస్టులు : 590
    పోస్టులు : అసిస్టెంట్ ప్రొఫెసర్
    విభాగాలు : నియోనాటాలజీ, నెఫ్రాలజీ, న్యూరో సర్జరీ, కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ, మెడికల్ జీఈ, న్యూరాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, సర్జికల్ జీఈ, సర్జికల్ అంకాలజీ, యూరాలజీ, వాస్కులర్ సర్జరీ, అనస్థీషియా, డెర్మటాలజీ త‌దిత‌రాలు.
    అర్హ‌త‌లు : డీఎం, ఎండీ, ఎంఎస్‌, డీఎన్‌బీ, డీఎంఏ ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి.
    ఎంపిక : పీజీ ఫైనల్ ఎగ్జామ్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ద్వారా ఎంపిక ఉంటుంది.
    ద‌ర‌ఖాస్తు : ఆన్‌లైన్‌లో
    ద‌ర‌ఖాస్తు ఫీజు : జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌కు రూ.1000. బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.500.
    వ‌య‌స్సు : 42 ఏండ్లు దాట‌కుడ‌దు.
    వెబ్‌సైట్ : dme.ap.nic.in
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు