Friday, September 13, 2024
spot_img

ఘనంగా విజయ్‌ ఆంటోని ‘హత్య’ ప్రీ రిలీజ్‌

తప్పక చదవండి

యంగ్‌ హీరోలు అడివి శేష్‌, సందీప్‌ కిషన్‌ అతిథులుగా కోలీవుడ్‌ హీరో విజయ్‌ అంటోని నటిస్తున్న కొత్త సినిమా ‘హత్య’ ప్రీ రిలీజ్‌ కార్యక్రమం హైదరాబాద్‌ లో ఘనంగా జరిగింది. క్రైమ్‌ థ్రిల్లర్‌ బ్యాక్‌ డ్రాప్‌లో దర్శకుడు బాలాజీ కుమార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో విజయ్‌ ఆంటోని డిటెక్టివ్‌ పాత్రలో కనిపించనున్నారు. రితికా సింగ్‌, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించారు. లోటస్‌ పిక్చర్స్‌, ఇన్ఫినిటీ ఫిల్మ్‌ వెంచర్స్‌ బ్యానర్స్‌ పై కమల్‌ బోరా, జి.ధనుంజయన్‌, ప్రదీప్‌ బి, పంకజ్‌ బోరా, విక్రమ్‌ కుమార్‌, తాన్‌ శ్రీ దొరైసింగం పిళ్లై, సిద్ధార్థ్‌ శంకర్‌, ఆర్‌విఎస్‌ అశోక్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 21న గ్లోబల్‌ సినిమాస్‌, సురేష్‌ ప్రొడక్షన్‌ ద్వారా తెలుగులో విడుదలవుతోంది. ప్రీ రిలీజ్‌ కార్యక్రమంలో దర్శకుడు బాలాజీ కుమార్‌ మాట్లాడుతూ మా కార్యక్రమానికి అతిథులుగా వచ్చిన సందీప్‌ కిషన్‌, అడివి శేష్‌ కు థాంక్స్‌. విజయ్‌ ఆంటోనీకి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. ప్రతిసారీ కొత్త కంటెంట్‌ తో మీ ముందుకు వస్తుంటారు. ఈ సినిమా కూడా అలాగే విభిన్నంగా ఉంటుంది. 1923లో జరిగిన ఓ ఘటన ఆధారంగా హత్య చిత్రాన్ని రూపొందించాను. మా కంటే థియేటర్‌ లో సినిమానే మాట్లాడితే బాగుంటుంది. ఒక మంచి థ్రిల్లర్‌ మూవీగా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. అన్నారు. సంగీత దర్శకుడు గిరీష్‌ గోపాలకృష్ణన్‌ మాట్లాడుతూ హత్య సినిమాకు పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. గతంలో రెండు మూడు సార్లు హైదరాబాద్‌ వచ్చాను. మీరు సినిమాను ఎంత లవ్‌ చేస్తారో తెలుసు. హత్య సినిమా కోసం డిఫరెంట్‌ మ్యూజిక్‌ ట్రై చేశాం. థ్రిల్లర్‌ కాబట్టి మ్యూజిక్‌ ప్యాట్రన్‌ లో వేరియేషన్‌ తీసుకొచ్చాం. యూరప్‌ లో ఫేమస్‌ అయిన ఓఫ్రా స్టైల్‌ లో ఓ పాట చేశాం. అలాగే మంచి లిరిక్స్‌ కుదిరాయి. అన్నారు. నిర్మాత జి. ధనుంజయన్‌ మాట్లాడుతూ హత్య సినిమాను విడుదల చేస్తున్న గ్లోబస్‌ సినిమాస్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌ కు థాంక్స్‌. ఒక యూనిక్‌ థ్రిల్లర్‌ మూవీ అనుభూతిని మా సినిమా కలిగిస్తుంది. అయితే సినిమా చూసిన వారు స్పాయిలర్స్‌ ద్వారా కథలో విలన్‌ ఎవరు అనేది దయచేసి రివీల్‌ చేయకండి. ఆ ట్విస్ట్‌ ను థియేటర్‌ లోనే చూస్తే బాగుంటుంది. విజయ్‌ ఆంటోనీ గారితో పాటు మీనాక్షి చౌదరి ఈ సినిమాకు ఓ ఫిల్లర్‌ గా నిలబడిరది. ఆమె ఈ సినిమాకు బాగా ప్రమోషన్‌ చేసింది. చెప్పారు. హీరో విజయ్‌ ఆంటోనీ మాట్లాడుతూ అడివి శేష్‌ మా సినిమాలకు లక్కీ మస్కట్‌ లాంటి వారు. సందీప్‌ మార్నింగ్‌ షూటింగ్‌ చేసి ఇక్కడికి వచ్చారు. శేష్‌ , సందీప్‌ కు థాంక్స్‌. బాలాజీ గారితో శేష్‌, సందీప్‌ ఇద్దరూ సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. అతను మంచి టెక్నీషియన్‌. ఫిల్మ్‌ మేకింగ్‌ లో బాలాజీ గారికి పూర్తి అవగాహన ఉంది. హత్య సినిమా మేకింగ్‌ లో మా ప్రొడక్షన్‌ సంస్థలు ఎంతో ఇన్వాల్వ్‌ అయ్యాయి. ఈ సినిమా మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ వింటే హాలీవుడ్‌ డిటెక్టివ్‌ మూవీస్‌ గుర్తొస్తాయి. గిరిష్‌ అంత మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. ఈ సినిమాను సక్సెస్‌ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు