అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ సీజన్-4 టైటిల్‌ను గోవా చాలెంజర్స్ కైవసం చేసుకుంది. ఆదివారం ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో గోవా 8-7తో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై లయన్స్‌పై గెలిచింది. గోవాకు ఇదే తొలి టైటిల్ కావడం విశేషం. భారత టాప్ ర్యాంక్ ప్యాడ్లర్ హర్మిత్ దేశాయ్, వరల్డ్ చాంపియన్‌షి్‌ప మెడలిస్ట్ అల్వారో రోబుల్స్ గోవా గెలుపులో కీలకపాత్ర పోషించారు. విజేత గోవాకు రూ.75 లక్షలు, రన్నరప్ చెన్నైకు రూ.50 లక్షలు ప్రైజ్‌మనీగా లభించింది.