Tuesday, June 18, 2024

న్యూ జెర్సీ లో బీజేపీ నాయకులు భాను ప్రకాష్ రెడ్డి, ప్రదీప్ రవికాంతి ల మీట్ అండ్ గ్రీట్..

తప్పక చదవండి

భారతీయ జనతా పార్టీ నాయకులు టీటీడీ మాజీ బోర్డు మెంబెర్ భాను ప్రకాష్ రెడ్డి, ప్రదీప్ రవికాంతి అమెరికా పర్యటనలో బాగంగా న్యూ జెర్సీలో ఆత్మీయ సభ (మీట్ అండ్ గ్రీట్) కార్యక్రమంలో భాను ప్రకాష్ రెడ్డి, ప్రదీప్ రవికాంతి తెలంగాణా.. ఆంధ్ర ప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ పాత్రను, మోడీ వల్ల తెలుగు రాష్ట్రాలకు జరుగుతున్న అభివృద్ధిని సబికులకు తెలియచేసారు. కేంద్ర ప్రబుత్వం తెలంగాణా అభివృద్ధి కోసం ఏ రకంగా సహకరిస్తుంధో తెలియచేస్తూ, స్మార్ట్ సిటీస్ ని ఏరకంగా అభివృద్ధి పరచవచ్ఛో తెలియజేసారు , దీని కోసం బీజేపీ ప్రభుత్వం, మోడి అందిస్తున్న సహాయాన్ని కొనియాడారు. గ్రామీణాభివృద్ధి కోసమా కేంద్ర , రాష్ట్రాల ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలని వెల్లడిస్తూ.. తమ తమ గ్రామాల అభివృద్ధి కోసం తెలంగాణా ప్రవాస భారతీయులు ని సహక రించాలిసేందిగా విజ్ఞప్తి చేసారు.

అవినీతి నిర్మూలన, విద్య వ్యాప్తి, గ్రామీణా నీటి సరపరా, తాగు, సాగు నీటి ప్రాజెక్ట్లు , అవసరముంది అని అన్నారు. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్తు సరపరా, విద్యార్థులకు వసతి గృహాల సదుపాయం, బలహీన వర్గాలకి పక్కా గృహా సదుపాయం వంటి నిత్యావసర పనులను సాదించినపుడు తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధిని సాదించగలమని తెలియచేసారు. బంగారు తెలంగాణాను వేగముగా సాదించడానికి తెలంగాణా ప్రవాస భారతీయులు చురకైన పాత్ర పోషించారని తెలంగాణ నాయకులు నల్గొండ జిల్లా బీజేపీ ఇంఛార్జ్ ప్రదీప్ రవికాంతి ఈ సందర్భావముగా వివరించారు. హిందూ ధర్మాన్ని, దేశాన్ని కాపాడేది, రక్షించేది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమేనని ఈ సందర్బంగా ఇరువురు నాయకులు తెలిపారు. తెలంగాణలో అధికారం, అంధ్ర ప్రదేశ్ లో బీజేపీని మేజర్ ఫోర్స్ గా ఉండడంలో ప్రవాస భారతీయులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమములో అఫ్-బీజేపీ పూర్వ అధ్యక్షులు కృష్ణారెడ్డి అనుగుల మాట్లాడుతూ.. ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ తరుపున మీటింగ్స్ లో ప్రవాస భారతీయులలో భారత దేశములో మోడీ చేసున్న అభివృద్ధి , తెలంగాణకు, తెలుగు రాష్ట్రాలకు కేంద్రం చేస్తున్న కార్యక్రమాలను వివరించడం అన్నది ప్రదీప్ రవికాంతి, భాను ప్రకాష్ రెడ్డి కి ఉన్న కమిట్మెంట్ అని వివరించారు. తెలంగాణ అఫ్-బీజేపీ కన్వీనర్ విలాస్ రెడ్డి జంబుల మాట్లాడుతూ ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ చేస్తున్న కార్యక్రమాలను వివరించారు.

- Advertisement -

తెలంగాణ అఫ్-బీజేపీ వ్యూహాత్మక వ్యవహారాలు కో-కన్వీనర్ సంతోష్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని ఎన్నారైలు కోరుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణ అఫ్-బీజేపీ న్యూ జెర్సీ ప్రాంతీయ కన్వీనర్ వంశీ యంజాల, కో-కన్వీనర్ ప్రదీప్ రెడ్డి కట్ట మాట్లాడుతూ భాను ప్రకాష్ రెడ్డి, ప్రదీప్ రవికాంతి లు ముఖ్య అతిధులుగా రావడంతో అమెరికాలో పనిదినం అయినప్పటికీ చాల మంది మిత్రులు పాల్గొనడం చాలా సంతోషకరం అని తెలిపారు. ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ, మిగితా తెలుగు మిత్రులు నిర్వాహించిన ఈ సభలో కృష్ణారెడ్డి అనుగుల (అఫ్-బీజేపీ జాతీయ పూర్వ అధ్యక్షులు ), విలాస్ రెడ్డి జంబుల (తెలంగాణ అఫ్-బీజేపీ కన్వీనర్) , సంతోష్ రెడ్డి (తెలంగాణ అఫ్-బీజేపీ వ్యూహాత్మక వ్యవహారాలు కో-కన్వీనర్ ), సుదిన్ తమ్మ (ఆంధ్ర ప్రదేశ్ అఫ్-బీజేపీ అఫ్-బీజేపీ అనుసంధాన కో-కన్వీనర్) , వంశీ యంజాల (తెలంగాణ అఫ్-బీజేపీ న్యూ జెర్సీ ప్రాంతీయ కన్వీనర్), ప్రదీప్ రెడ్డి కట్ట (తెలంగాణ అఫ్-బీజేపీ న్యూ జెర్సీ ప్రాంతీయ కో-కన్వీనర్), మధుకర్ (తెలంగాణ అఫ్-బీజేపీ మీడియా కో-కన్వీనర్ ), అఫ్-బీజేపీ సీనియర్ కార్యకర్తలు గోపి సముద్రాల, రఘు కనుగొ, కృష్ణ మోహన్ మూలే , నాగరాజు, అదే విధముగా కమ్యూనిటీ లీడర్స్ శరత్ వేముల, రామ్మోహన్ ఎల్లంపల్లి, శ్రీనివాస్ గణగోని, దుర్గ ప్రసాద్ పెద్ది, మురళి, రఘువీర్ రెడ్డి, రామ్ వేముల, రత్నాకర్ రెడ్డి, హరికృష్ణ, ఉమా, వెంకట్ చవ్వా, సత్య , కార్తీక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు