Thursday, May 16, 2024

న‌క్స‌ల్ క‌మాండ‌ర్ అరెస్టు..

తప్పక చదవండి

ఇతనిపై ల‌క్ష రివార్డు ఉంది..

త‌ల‌పై ల‌క్ష రివార్డు ఉన్న ఓ న‌క్స‌ల్ కమాండ‌ర్‌ ను చ‌త్తీస్‌ఘ‌డ్‌లో భ‌ద్ర‌తా ద‌ళాలు అరెస్టు చేశాయి. సుక్మా జిల్లాలో ఆ అరెస్టు జ‌రిగింది. అత‌ని వ‌ద్ద నుంచి టిఫిన్ బాంబు, నాలుగు డిటోనేట‌ర్లు, నాలుగు జెల‌టిన్ రాడ్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. చ‌త్తీస్‌ఘ‌డ్ పోలీసులు, కోబ్రా, సీఆర్పీఎప్‌ ద‌ళాలు సంయుక్తంగా ఈ ఆప‌రేష‌న్ చేప‌ట్టాయి. అరెస్టు చేసిన న‌క్స‌లైట్‌ను సోది దివా అలియాస్ సునిల్‌గా గుర్తించారు. సుర్ప‌న్‌గుడ ఆర్పీసీ ప్రాంతంలో ప్లాటూన్ క‌మాండ‌ర్‌గా దివా ప‌నిచేస్తున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. అనేక నేరాల్లో ఆ న‌క్స‌లైట్ పాత్ర ఉన్న‌ట్లు అధికారులు చెప్పారు. ఐఈడీ పేలుళ్లు, మ‌ర్డ‌ర్లు, భ‌ద్ర‌తా ద‌ళాల‌పై దాడులు, ఎన్‌కౌంట‌ర్లు, స‌ర్పంచుల హ‌త్య లాంటి కేసుల్లో అత‌నున్నాడు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు