Wednesday, October 16, 2024
spot_img

అదిరిపోయిన బ్లాక్‌ అండ్‌ వైట్‌ కాంబో..

తప్పక చదవండి

టాలీవుడ్‌లో రాబోతున్న మోస్ట్‌ క్రేజీయెస్ట్‌ సినిమాల్లో ఒకటి బోయపాటి శ్రీను, ఎనర్జిటిక్ యాక్టర్ రామ్‌ కాంబోలో వస్తున్న ర్యాపో 20. మాస్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించి చివరి షెడ్యూల్ షురూ కానుందని ఇప్పటికే అప్‌డేట్ వచ్చింది. తాజాగా రామ్‌ అండ్ శ్రీలీల టీం ఫైనల్ షెడ్యూల్ షురూ చేసింది. ఈ షెడ్యూల్‌ కోసం నేడు మైసూర్‌లో ల్యాండింగ్ అయింది బోయపాటి అండ్ రామ్‌ టీం. వైట్‌ అండ్ వైట్‌ డ్రెస్‌లో రామ్‌తో దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేసింది. వైట్‌ డ్రెస్‌లో రామ్‌, బ్లాక్‌ డ్రెస్‌లో శ్రీలీల.. మ్యాచింగ్ స్టైలిష్ బ్లాక్ గాగుల్స్‌ పెట్టుకున్న స్టిల్స్‌ ఇప్పుడు నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ కూడా కీలక పాత్రలో నటిస్తోంది. ఇటీవలే 24 రోజులపాటు కష్టపడి స్టన్నింగ్‌ యాక్షన్‌ సీక్వెన్స్ పూర్తి చేసినట్టు అప్‌డేట్‌ కూడా అందించాడు రామ్‌.

ఇప్పటికే ర్యాపో 20 నుంచి విడుదల చేసిన పోస్టర్లు నెట్టింట హల్ చల్ చేస్తూ.. సినిమాపై సూపర్ బజ్‌ క్రియేట్ చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు మేకర్స్‌ ప్రకటించారు. అఖండ తర్వాత బోయపాటి శ్రీను కాంపౌండ్‌ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ర్యాపో 20 చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్స్ ప‌తాకంపై ప‌వ‌న్ కుమార్ స‌మ‌ర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్నడ, హిందీలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు