Wednesday, October 16, 2024
spot_img

డెబిట్‌ కార్డు అక్కర్లేదు..

తప్పక చదవండి

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తన ఏటీఎంల నుంచి యూపీఐ ఉపయోగించుకుని నగదు విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇందుకోసం ఇంటర్‌ఆపరేటబుల్‌ కార్డ్‌లెస్‌ క్యాష్‌ విత్‌డ్రాయిల్‌ (ఐసీసీడబ్ల్యూ)ను ప్రారంభించింది. ఖాతాదారులు వారి మొబైల్‌ ఫోన్లలో ఐసీసీడబ్ల్యూను ఎనేబుల్‌ చేసిన యూపీఐ అప్లికేషన్‌ ద్వారా డెబిట్‌ కార్డు లేకుండానే బీవోబీ ఏటీఎంలో నగదును విత్‌డ్రా చేసుకోవచ్చని తెలిపింది.బీవోబీ ఏటీఎంలో ‘యూపీఐ క్యాష్‌ విత్‌డ్రాయిల్‌’ను ఎంచుకుని, తీసుకోదల్చిన మొత్తాన్ని ఎంటర్‌ చేస్తే ఏటీఎం స్క్రీన్‌పై డిస్‌ప్లే క్యూఆర్‌ కోడ్‌ను యూపీఐ యాప్‌ ద్వారా స్కాన్‌ చేయాలి. ఆ తదుపరి మొబైల్‌కు యూపీఐ పిన్‌ వస్తుందని తెలిపింది. ఒక్కో లావాదేవీకి గరిష్ఠ పరిమితి రూ. 5,000కాగా, రోజుకు రెండు లావాదేవీలు దీనితో జరుపుకోవచ్చు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు