Monday, April 15, 2024

నవాబ్‌ పేట్‌ రోడ్డు కాదది యమపురికి దారి

తప్పక చదవండి
  • నత్త నడకన సాగుతున్న రోడ్డు పనులు… ప్రమాదాల బారిన ప్రజలు
  • తాజాగా మరో కారు బోల్తా.. ఇద్దరికి గాయాలు..

వికారాబాద్‌: వికారాబాద్‌ జిల్లా కొత్తగడి మీదుగా నవాబుపేట రోడ్డు పనులు నత్తనడకన సాగుతుండడంతో నిత్యం ఆ రూట్‌ లో ఏదో ఒకచోట ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. తాజాగా శుక్రవారం నాగిరెడ్డిపల్లి గేటు సమీపంలో కారు అదుపుతప్పి బోల్తా పడిరది. ఈ ప్రమాదంలో మండల కేంద్రానికి చెందిన రవీందర్‌ రెడ్డి కి అతని కుమారులకు గాయాలయ్యాయి. రోడ్డు విస్తరణలో భాగంగా చేపట్టిన పనులు సంవత్సరాల కాలంగా నత్త నడకన సాగుతుండడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్డు పనుల్లో ఇంత నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్‌ లపై ఎందుకు చర్యలు తీసుకోరని స్థానికులు మండిపడుతున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కు కావడం చేతనే ప్రజా ప్రతినిధులు ఎవరు ఈ రోడ్డుపై స్పందించడం లేదని పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించలేని అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఉంటే ఎంత ఊడితే ఎంత అని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నవాబ్‌ పేట రోడ్డుని చూస్తే యమలోకమే గుర్తుకొస్తుందని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు పాలకులు, కళ్ళు తెరిచి రోడ్డు విస్తీర్ణం పనులు త్వరితగతిన పూర్తిచేసి ఉపశమనం కలిగించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు