Friday, May 17, 2024

నమ్మితే నట్టేట ముంచేశాడు

తప్పక చదవండి
  • కట్టుకున్న ఇండ్లకు రిజిస్ట్రేషన్‌ చెయ్యకుండా పంగనామాలు
  • దారెడ్డి కృష్ణా రెడ్డి మోసాలపై గళమెత్తిన కేతిరెడ్డిపల్లి గ్రామస్తులు
  • రోడ్డుపై భైటాయించి తమకు న్యాయం చేయాలని డిమాండ్‌
  • మొన్న న్యాయం చేస్తానని, నేడు ముఖం చాటేశాడని ఆరోపణ
  • మరో రూ.4లక్షలు చెల్లిస్తే రిజిస్ట్రేషన్‌ చేయిస్తానంటూ కొత్త రాగం
  • దిక్కుతోచని స్థితిలో గ్రామస్తులు.. న్యాయం కోసం రోడ్డెక్కిన వైనం

హైదరాబాద్‌ : దారెడ్డి కృష్ణారెడ్డి నమ్మించి మోసం చేయడమేగాక , అక్రమ కేసులు పెట్టించి కోర్టు చుట్టు తిప్పుతున్నాడని కేతిరెడ్డిపల్లి గ్రామస్తులు ఆందోళన బాట చేపట్టారు. రోడ్డుపై బైటాయించి న్యాయం చేయాలనీ డిమాండ్‌ చేశారు .వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలంలోని కేతిరెడ్డిపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే సంఖ్య 2లో 2ఎకరాల 35గుంటలలోని 53ప్లాట్లను దారెడ్డి కృష్ణా రెడ్డి 2004 సం. లో ఒక్కో ప్లాటుకు 35వేల పై చిలుకు ప్రకారం అప్పటి మార్కెట్‌ రేటు ప్రకారం తమకు అగ్రిమెంట్‌ చేసి అమ్మాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అప్పటినుంచి రిజిస్ట్రేషన్‌ చేయమన్నప్పుడల్లా రేపు మాపంటూ తిప్పుతున్నాడు గాని రిజిస్ట్రేషన్‌ చేయడంలేదని కేతిరెడ్డిపల్లి గ్రామస్తులు ఆరోపించారు. గ్రామస్తుల ఆరోపణలకు బిన్నంగా దారెడ్డి కృష్ణారెడ్డి ఆరోపణలు వినిపిస్తున్నారు . అసలు పట్టాదారుడు రాందాస్‌ మోహన్‌ గౌడ్‌ అందుబాటులో ఉండటంలేదని తానూ ఎన్నిసార్లు అడిగిన రిజిస్ట్రేషన్‌ చేయడంలేదని అతను వచ్చాక తప్పక రిజిస్ట్రేషన్‌ చేపిస్తానని దారెడ్డి కృష్ణారెడ్డి చెబుతున్నారు. అయితే ఇలా చాల సార్లు చెప్పి తమని మోసం చేస్తూ వస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు . మరో 4లక్షలు అదనంగా చెల్లిస్తే రిజిస్ట్రేషన్‌ చేయిస్తానంటూ దారెడ్డి కృష్ణారెడ్డి కొత్త రాగం అందుకున్నాడని గ్రామస్తులు వాపోతున్నారు. రెండు సంవత్సరాల క్రితం నగరానికి చెందిన పట్టాదారుడు రాందాస్‌ మోహన్‌ గౌడ్‌ వచ్చి నా పట్టా భూమిలో ఇల్లు ఎలా కట్టారని కేసు వేసి కోర్టుల చుట్టు తిప్పుతున్నాడని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు.దీనికంతటికి అసలు కారణం దారెడ్డి కృష్ణారెడ్డి అంటున్నారు గ్రామస్తులు
మొన్న న్యాయం చేస్తానని, నేడు ముఖం చేశాడని ఆరోపణ..
ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రజలు, దారెడ్డి కృష్ణా రెడ్డి ఇటీవల పోలీస్‌ స్టేషన్‌ లో కలుసుకున్నారు.పోలీస్‌ స్టేషన్‌ లోనే గ్రామ పెద్దల సమక్షంలో 3నెలల్లో రూ.85లక్షలు దారెడ్డి కృష్ణా రెడ్డి ఇస్తానని బాండ్‌ రాసిచ్చాడు.అయితే తాజాగా మాట మార్చి తిరిగి ఒక్కో ప్లాటుకు మరో 4లక్షలు ఇస్తేనే రిజిస్ట్రేషన్‌ చేస్తానని మాటమార్చి నయా వాదనకు తెర లేపి గ్రామంలో ప్రశ్నించిన పెద్దవారిపై కేసులు పెట్టిస్తున్నాడని గ్రామస్తులు మండిపడుతున్నారు.కష్టపడి పైసా పైసా కూడబెట్టుకుని ప్లాట్లు కొని 20ఏండ్ల క్రితమే ఇల్లు కట్టుకుని జీవనం సాగిస్తున్నామని..అయితే రాందాస్‌ మోహన్‌ గౌడ్‌,వెంకట్‌ గౌడ్‌,దారెడ్డి కృష్ణా రెడ్డి అనే త్రిమూర్తులు కుమ్మకై మాకు శతవిధాలా ఇబ్బందులు పెడుతున్నారని గ్రామస్తులు శుక్రవారం తీవ్ర ఆరోపణలు చేశారు. దారెడ్డి కృష్ణా రెడ్డే కేసులు పెట్టించి కోర్టులు చుట్టు తిప్పుతుంటే మేం ఊర్లో ఉండాల్నా చావాల్నా అని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు.ఇప్పటికైనా పోలీసులు తమకు న్యాయం జరిగేలా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు