Friday, May 17, 2024

ముదిరాజు జాతి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిబేషరతు బహిరంగ క్షమాపణ చెప్పాలి..

తప్పక చదవండి
  • కరీంనగర్ ముదిరాజ్ సంఘం నాయకులు డిమాండ్..

ముదిరాజు జాతి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి బేషరతు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ ప్రెస్ భవన్ లో పత్రికా సమావేశం నిర్వహించారు.. పాడి కౌశిక్ రెడ్ది ముదిరాజు ముద్దుబిడ్డను కొట్టడమే గాక, యావత్తు కులాన్ని పరుష పద జాలముతో బూతులు తిట్టడంను ముదిరాజ్ సంఘం పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది తెలంగాణ ముదిరాజుల ఆత్మ గౌరవాన్ని దెబ్బదీసే దుర్మాగమైన చర్యయని, రాబోయే కాలములో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. అంతేగాక ఇలాంటి నీచ సంస్కృతి, అహంకార ధోరణి వల్ల భారస పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని తక్షణమే పదవి నుండి బర్తరఫ్ చేస్తూ, పార్టీ నుండి సస్పెండ్ చేయాలనీ ముఖ్యమంత్రికి, మంత్రివర్యులకు కరీంనగర్ ముదిరాజ్ సంఘం నాయకులు విన్నవించారు. ఈ పత్రికా సమావేశములో ఉమ్మడి జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు గుర్రాల మల్లేశం, మాజీ అధ్యక్షులు పిట్టల రవీందర్, జడ్పీటీసీ సభ్యులు గీకురు రవీందర్, యువత అధ్యక్షులు పండుగ బాలు, మాజీ జిల్లా ఫిషరీస్ కార్పొరేషన్ అధ్యక్షులు పోలు లక్ష్మణ్, మహిళా నాయకురాలు స్వరూపతో పాటు ముదిరాజ్ నాయకులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు