Saturday, May 18, 2024

పాడి కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం..

తప్పక చదవండి

కెమెరామెన్ అజయ్ పై ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గన్నేరువరం మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు బోయిని పోశెట్టి ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కాంప్లెక్స్ ముందు కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. నాయకులు మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గం లో పాడి కౌశిక్ రెడ్డి ఆగడాలకు అంతులేకుండా పోయిందని. జర్నలిస్టు అజయ్ ను బంధించి చితక బాదడమే కాకుండా ముదిరాజ్ కులస్తులందరినీ నానా బూతులు తిట్టి అవమానపరచడం హేయమైన చర్య అని అన్నారు.. వెంటనే ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని. ముదిరాజ్ కులస్తులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.. లేనిపక్షంలో జిల్లాలో, రాష్ట్రంలో రాస్తా రోఖోలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కులస్తులు, యువకులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు