- సవాల్ విసిరిన కాంగ్రెస్ నేత మేనేని రోహిత్ రావు..
మంత్రి గంగుల కమలాకర్, బండి సంజయ్ల మధ్య చీకటి ఒప్పందాన్ని బట్టబయలు చేస్తూ.. శనివారం రోజు స్థానిక మహాశక్తి ఆలయంలో నిర్వహించే ప్రెస్ మీట్ కు హాజరవుతున్న రోహిత్ రావు ని హౌస్ అరెస్టు చేశారు పోలీసులు.. దీంతో ఆయన తన నివాసంలోనే అమ్మవారి పటం ముందు రాజకీయ ప్రమాణం చేసి దమ్ముంటే బండి సంజయ్ మహాశక్తి ఆలయానికి విచ్చేసి స్థానిక మంత్రి గంగుల కమలాకర్ తో ఎటువంటి లోపాయి కార ఒప్పందం లేదని అమ్మవారి ముందు ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం రోహిత్ రావుని అరెస్టు చేసి పోలీస్ ట్రేనింగ్ సెంటర్ కి తరలించారు పోలీసులు. దీంతో తీవ్ర ఆందోళన చేపట్టారు రోహిత్ రావు అనుచరులు.