Tuesday, July 16, 2024

ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి.

తప్పక చదవండి
  • పిలుపునిచ్చిన ఎర్ల వెంకన్న ముదిరాజ్..

ఆదివారం రోజు ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఆత్మీయ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఎర్ల వెంకన్న ముదిరాజ్ మాట్లాడుతూ… త్వరలో ములుగు జిల్లా కేంద్రంలో ముదిరాజ్ కుల ప్రజా ప్రతినిధులకు, మత్స్య శాఖ సొసైటీ చైర్మన్లు, డైరెక్టర్లు, వ్యవసాయ సహకార సంఘాల ఛైర్మన్లు, డైరెక్టర్లు, గ్రామ పంచాయతీ సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, వార్డు మెంబర్లు, ఎంపిటిసిలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర ఉద్యోగులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు వివిధ రంగాల్లో జాతి కోసం సేవలందిస్తున్న ముదిరాజ్ కులస్తులకు అతి “తర్వలో ఆత్మీయ సన్మానం” ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ సమావేశానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న ముదిరాజ్ కులస్తులు పెద్దయెత్తున హాజరై విజయవంతం చేయాలని ఒక ప్రకటనలో తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ సొసైటీ చైర్మన్ సాధు రఘు ముదిరాజ్, సొసైటీ కన్వీనర్ కలాలి అనిల్ ముదిరాజ్, సర్పంచ్ మోర రాజయ్య ముదిరాజ్, ఉప సర్పంచ్ సాధు రాజు ముదిరాజ్, ముదిరాజ్ యువ చైతన్య వేదిక జిల్లా ఇంఛార్జీ అచ్చునూరి కిషన్ ముదిరాజ్, వార్డు మెంబర్ కుక్కల నాగరాజు, ముదిరాజ్, మెట్టు సురేష్ ముదిరాజ్, రెడ్డి రంజిత్ ముదిరాజ్, కుక్కల కుమార్ ముదిరాజ్, మారబోయిన రవీందర్ ముదిరాజ్, కొండవేని శంకర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు