Thursday, May 2, 2024

బైకుల పిచ్చి క్రికెటర్..

తప్పక చదవండి
  • ధోనీ ఒక ఆసాధారణ వ్యక్తి : ట్వీట్ చేసిన వెంకటేష్ ప్రసాద్..

మాజీ క్రికెట‌ర్ ధోనీకి బైక్‌లంటే పిచ్చి. అత‌ని వ‌ద్ద ఎన్ని బైక్‌లు ఉన్నాయో చెప్ప‌లేం. ఏ కంపెనీ బైక్ లేదో కూడా చెప్ప‌డం క‌ష్ట‌మే. స్వంత ఊరు రాంచీలో ధోనీ ఓ బైక్ గ‌రాజ్‌నే క‌ట్టేశాడు. మిస్ట‌ర్ కూల్ బైక్ క‌లెక్ష‌న్ చూసిన మాజీ క్రికెట‌ర్లు బిత్తెర‌పోతున్నారు. ఇంత పిచ్చేంటి అన్న అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు. రాంచీ ఫామౌజ్‌లో ఉన్న ధోనీ బైక్ హౌజ్‌కు మాజీ క్రికెట‌ర్లు వెంక‌టేశ్ ప్ర‌సాద్‌, సునీశ్ జోషీలు ఆ క‌లెక్ష‌న్ చూసి స్ట‌న్ అయ్యారు. మాజీ పేస్ బౌల‌ర్ వెంక‌టేశ్ ప్ర‌సాద్ ఆ గ‌రాజ్‌కు చెందిన వీడియోను పోస్టు చేశారు. ధోనీకి బైక్‌లంటే ఇష్ట‌మ‌న్న విష‌యం తెలుసు కానీ, దాదాపు వంద‌కు పైగా బైక్‌లు అత‌ని వ‌ద్ద ఉన్న‌ట్లు ఆ వీడియో చూస్తే కానీ తెలియ‌డం లేదు. ధోనీ బైక్ హౌజ్‌ను చూసిన వెంక‌టేశ్ ప్ర‌సాద్ త‌న మ‌న‌సులోని మాట‌ను ఆపుకోలేక‌పోయారు. ఒక వ్య‌క్తిలో ఎంత క్రేజీ ప్యాష‌న్ ఉంటుందో చూశాన‌ని ప్ర‌సాద్ అన్నాడు. ఏంటా క‌లెక్ష‌న్‌, ధోనీ ఓ గొప్ప సాధ‌కుడు, ఓ అసాధార‌ణ వ్య‌క్తి అంటూ వెంక‌టేశ్ త‌న ట్వీట్‌లో తెలిపాడు.

ధోనీ భార్య సాక్షీ .. ఫామౌజ్‌కు వ‌చ్చిన అతిథుల్ని ఇంట‌ర్వ్యూ చేసింది. రాంచీలో ఎలా ఫీల‌వుతున్నార‌ని వాళ్ల‌ను అడిగింది. దానికి ప్ర‌సాద్ స‌మాధానం ఇస్తూ అమేజింగ్‌గా ఉంద‌న్నాడు. రాంచీ రావ‌డం ఇది తొలిసారి కాదు అని, నాలుగోసారి వ‌చ్చాన‌న్నాడు. కానీ ధోనీ బైక్ క‌లెక్ష‌న్ సెంట‌ర్ మాత్రం క్రేజీగా ఉంద‌న్నాడు. మ‌రో మాజీ క్రికెట‌ర్ జోషీ మాట్లాడుతూ.. అస‌లు ఈ సెట‌ప్ గురించి వివ‌రించ‌లేమ‌న్నారు. ఎంత పిచ్చి ఉంటే ఇన్ని బైక్‌లు ఉంటాయ‌ని ప్ర‌సాద్ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశాడు. ఇవ‌న్నీచూస్తుంటే ఇక్క‌డో బైక్ షోరూమ్ అవుతుంద‌ని చెప్పుకొచ్చాడు. విప‌రీత‌మైన మోజు ఉంటే త‌ప్ప ఇది సాధ్యం కాద‌న్నాడు. వీడియో తీసిన సాక్షీ కూడా ధోనీని ఓ ప్ర‌శ్న వేసింది. ఎందుకు మ‌హీ, ఈ బైక్ క‌లెక్ష‌న్ ఎందుకోసం అని అడిగిందామె. దానికి మాజీ కెప్టెన్ స‌మాధానం ఇస్తూ.. ఎందుకంటే నువ్వు అన్నీ తీసుకున్నావు, కానీ నాకంటూ ఒక‌టి స్వంతంగా ఉండాలి క‌దా.. ఈ ఒక్క బైక్ హౌజ్‌కు మాత్ర‌మే నువ్వు అంగీక‌రించిన‌ట్లు చెప్పాడు. ధోనీ గ‌రాజ్‌లో రాజ్‌దూత్‌, క‌వాస‌కి నింజా, హ‌ర్లే డేవిడ్‌స‌న్‌, టీవీఎస్ రోనిన్ క్రూయిజర్ లాంటి బైక్‌లు ఉన్ఆన‌యి. ఇది త‌న భ‌ర్త ఫెవ‌రేట్ బొమ్మ‌ల‌ని గ‌తంలో ఓ సారి సాక్షీ కామెంట్ చేసిన విష‌యం తెలిసిందే.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు