- జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తే హత్యాయత్నం..
- గోడును వెళ్లబోసుకున్న బాధితుడు కొమిరి అల్లయ్య..
మిషన్ భగీరథ నల్లను ట్రాక్టర్ తో విరగొట్టిన చింటూను ఎందుకు అని అడిగిన సందర్భంలో జరిగిన గోడవపై బోనేపల్లి నాగరాజు, అక్కేనపల్లి నాగరాజు ఇంకా కొంతమంది కందుకూరి ప్రవీణ్ కుమార్ స్కార్పియోలో తిరుమలగిరి నుండి ఫణిగిరికి వచ్చి బోనేపల్లి నాగరాజు, వేర్పుల వెంకన్న తదితరులు కలిసి కొమిరె అల్లయ్య ఎస్సీ మాదిగ సామజికవర్గానికి చెందిన వారిపై హత్యాయత్నం చేశారు. అందులో వారి మెడ ఎముక, నరాలు విరిగిపోయాయి.. కాళ్ళు చేతులు భవిష్యత్ లో పనిచేయవు అని డాక్టర్ చెప్పారు అని వాళ్ళ తమ్ముడు తెలిపారు.. చూడటానికి వెళ్తామంటే అంటే వద్దు అని హాస్పిటల్ ముందే నిలిపి వేసి వెనక్కు పంపారు.
ప్రస్తుతం వారు నిమ్స్ హాస్పిటల్ లో వైద్యం చేయించుకుంటున్నారు. వారితో బాటు ఎల్లయ్య కొడుకు బాబు, కూతురు, మిగిలిన కుటుంబసభ్యులు హాస్పిటల్ లో ఉన్నారు. వాళ్ళు ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు.
ఇందులో ఏలాంటి తప్పులు లేకుంటే పేషేంట్ ను పరామర్శించాలని వెళ్తే బీ.ఆర్.ఎస్. పార్టీ నాగారం మండల అధ్యక్షుడు అడ్డుకోవడం ఎందుకు? రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఎందుకు ? ఎమ్మెల్యే కిషోర్ కుమార్ కి ఏమైనా సంబంధం ఉందా..? వారి అనుచరులకు ప్రత్యేకమైన రాజ్యాంగం ఏమైనా ఉందా నియోజకవర్గంలో ? ఇందులో కిషోర్ కుమార్ అనుచరుల ప్రమేయం లేకుంటే బహిరంగ చర్చకు రావాలి. మేము బాధితులకి అండగా ఉండాలని కోరుకుంటున్నాం బీ.ఆర్.ఎస్. పార్టీ నాయకులు బాధితులను దాచడంలోనే మాకు అనుమానం కలుగుతుంది. రహస్యంగా వైద్యం చేయించాల్సిన అవసరం ఏమిటి.
నియోజకవర్గమా ఇకనైనా మౌనం విడకుంటే మనం ఒక్కొక్కరిగా మట్టిలోకే.. ఈరోజు నేను రేపు నువ్వు.. మేలుకో నియోజకవర్గాన్ని ఏలుకో. దాడి చేసిన వాడే దయతో ఆదుకుంటున్నట్లు ప్రచారం చేసుకుంటున్న పరిస్థితికి బాధ కలుగుతుందని బాధితులు వాపోతున్నారు..