Saturday, June 15, 2024

రామక్రిష్ణ, హరిక్రిష్ణ హీరోలుగా చిత్రం…

తప్పక చదవండి
  • రామక్రిష్ణ, హరిక్రిష్ణ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘తికమక తాండ’.
    టిఎస్‌ఆర్‌ గ్రూప్‌ అధినేత టిఎస్‌ఆర్‌ మూవీ మేకర్స్‌ ప్రొడ్యూసర్‌ తిరుపతి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. గౌతమ్‌మీనన్‌, చేరన్‌, విక్రమ్‌ కె.కుమార్‌ వంటి దర్శకుల దగ్గరర కో డైరెక్టర్ గా పని చేసిన వెంకట్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్నో చిత్రాల్లో బాల నటిగా అలరించిన ఆని కథానాయికగా పరిచయమవుతోంది. రామక్రిష్ణ, హరిక్రిష్ణ ఇద్దరు కవలలు హీరోలుగా నటించడం విశేషం.
  • ఈ సందర్భంగా నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘‘ అర్ధవంతమైన చిత్రాలు చేయాలని సినిమాల్లోకి వచ్చా. తొలి చిత్రానికి మంచి కథ కుదిరింది. నిరూప్‌ కుమార్‌ ఇచ్చిన కథ, వెంకట్‌ ఎగ్జిక్యూషన్‌కు ఫిదా అయ్యి ఈ సినిమా చేస్తున్నా. మాటలు, సన్నివేశాలు ఎక్కడ అసభ్యత లేని కథ ఇది. కుటుంబ ప్రేక్షకులతోపాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం అలరిస్తుంది. సురేశ్‌ బొబ్బిలి సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. సిద్‌ శ్రీరామ్‌ పుత్తడి బొమ్మ పాట ఇప్పటికే యూట్యూబ్‌లో 11 లక్షల వ్యూస్‌ తెచ్చుకుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది’’ అని అన్నారు.
  • దర్శకుడు వెంకట్‌ మాట్లాడుతూ ‘‘1990లో గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది. సమాజంలో ఎప్పటినుండో ఉన్న ఒక సమస్య, ఆ సమస్య వల్ల ఒక గ్రామం అంతా మతిమరుపు సమస్యతో బాధపడుతుంటారు. ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డారనే సామాజిక అంశంతో ఈచిత్రం తెరకెక్కుతోంది. వరంగల్ జిల్లాలోని మారుమూల గ్రామంలో అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ చేశాం. రామక్రిష్ణ, హరిక్రిష్ణ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఆని నటన ఈ చిత్రానికి ప్రత్యేకంగా నిలుస్తుంది. కెమెరామెన్‌ పనితీరు హైలైట్‌గా నిలుస్తుంది’’ అని తెలిపారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు