Saturday, May 4, 2024

దుర్గామాత విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి..

తప్పక చదవండి

హైదరాబాద్, హవేళి ఘనాపూర్ మండలం, తిమ్మాయిపల్లి గ్రామంలో దుర్గామాత విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో బుధవారం నాడు మెదక్ ఎమ్మెల్యే యం. పద్మ దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. దుర్గామాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు ఎమ్మెల్యే పద్మ దేవేందర్.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దుర్గామాత అమ్మవారి కరుణా కటాక్షాలు తిమ్మాయిపల్లి గ్రామ ప్రజలపై మెదక్ నియోజకవర్గం ప్రజలపై ఉండాలని ,అందరికి శుభం కలగాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో అనేక పథకాలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. గ్రామంలో 25 మందికి పింఛన్ రాలేదని సర్పంచ్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే 25 మందికి పింఛన్ మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని అన్నారు. తిమ్మాయిపల్లి గ్రామంలో దుర్గామాత ఆలయం కట్టుకోవడం చాలా సంతోషమని అన్నారు. అమ్మవారి దయా కరుణా కటాక్షాలు ఈ గ్రామ ప్రజలపై ఉండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. జై దుర్గా భవాని మాతాకీ జై అని అన్నారు. సందర్భంగా ఎమ్మెల్యే ని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు లావణ్య రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ అంజా గౌడ్, మెదక్ పిఎసిఎస్ చైర్మన్ సిహెచ్. హనుమంత్ రెడ్డి, వార్డ్ మెంబర్లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు