Wednesday, September 11, 2024
spot_img

మేమెంతో మా వాటా అంత.. జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

తప్పక చదవండి
  • సామాజిక న్యాయంల, సమానత్వము కోసం- ఓ విప్లవం రావాలి
  • జనాభాలో 60శాతం పైగా ఉన్న బీసీలకు సరైన ప్రాధాన్యత లభించడం లేదు
  • కుల వివక్ష తొలగాలంటే అన్ని రంగాలలో – బీసీ లకు ప్రాతినిధ్యం కల్పించాలి.

రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల జనాభాను పరిగణలోకి తీసుకుని టికెట్లు కేటాయించాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి అన్నారు. బీసీ దళ్ తెలంగాణ యూత్ ప్రెసిడెంట్ రూబిన్ గౌడ్ ను నియమించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రూబిన్ గౌడ్ బీసీల కోసం ప్రాణమిచ్చే మనిషి అని.. అతడు జాతీయ బీసీ దళ్ ను మరింత ముందుకు తీసుకుని వెళ్తాడని దుండ్ర కుమారస్వామి ఆకాంక్షించారు. జాతీయ బీసీ దళ్ కు యువకులే కొండంత అండ.. బీసీలలో చైతన్యం నింపడానికి యువత చేస్తున్న కృషి అభినందనీయమని దుండ్ర కుమారస్వామి అన్నారు.

జనాభాలో 60శాతం పైగా ఉన్న బీసీలకు సరైన ప్రాధాన్యత లభించడం లేదని దుండ్ర కుమారస్వామి అన్నారు. కేంద్ర ప్రభుత్వం కులాల వారీగా జనాభా గణన చేపట్టకుండా బీసీల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతూ ఉందని అన్నారు. భారతదేశంలో బీసీలను నిర్లక్ష్యం చేస్తూ ప్రధాని మోదీ పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో 60శాతం పైగా జనాభా ఉన్న బీసీలకు రాజ్యాధికారం కట్టబెట్టాలని అన్నారు. ఐదుశాతం జనాభా ఉన్న కొన్ని సామాజికవర్గాలకు ఊహించని విధంగా పదవులు ఇస్తున్నారని అన్నారు. బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని.. బీసీలు అత్యధిక జనాభా ఉన్న స్థానాలలో అన్ని రాజకీయ పార్టీలు బీసీ అభ్యర్థులను ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -

ఎన్నో సార్లు ఎన్నికల సమయంలో బీసీ నాయకులు పదవుల కోసం త్యాగాలు చేశారని.. ఈసారి ఆ పని చేయకండని పలు పార్టీలలో ఉన్న బీసీ నాయకులను కోరారు దుండ్ర కుమారస్వామి. త్యాగాలు చేసి.. చేసి.. మంచి పేరును మాత్రమే మనకంటూ తెచ్చుకుంటున్నాము తప్పితే భవిష్యత్తు తరాలకంటూ సరైన న్యాయం చేయలేకపోతున్నామని అన్నారు దుండ్ర కుమారస్వామి. ఇకనైనా బీసీలు మేల్కొని.. ఇతరుల పల్లకీలను మోయకుంటే చాలని అన్నారు జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి. ఎన్నికల సమయంలో బీసీ కార్డుతో పబ్బం గడుపుకునే నాయకులను జాతీయ బీసీ దళ్ కనిపెట్టుకునే ఉందని.. వాళ్లకు సరైన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు దుండ్ర కుమారస్వామి.తెలంగాణ రాష్ట్ర బీసీ దళ్ యూత్ అధ్యక్షుడు ప రూబీన్ గౌడ్ మాట్లాడుతూ బీసీ యువత యువతని ఐక్యం చేసి మహాశక్తిగా మార్చి మా హక్కుల కోసం డిమాండ్ల కోసం అనుక్షణం పోరాడుతానని తెలియజేశాడు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ రూబిన్ గౌడ్,మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు రమణ యాదవ్ ,యూత్ అధ్యక్షుడు చరణ్, యువనేత గురువయ్య బాలాజీ శివరాం తలసాని సాయి శివారెడ్డి వసంత్ నవీన్ అఖిల్ మాధవ్ రాజేష్ వెంకట్ తదితరులు రాష్ట్రస్థాయిలో పాల్గొన్న యువ నేతలు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు