Wednesday, October 16, 2024
spot_img

చిరంజీవిపై ఎన్నికల కేసు కొట్టివేత..

తప్పక చదవండి
  • సినీ నటుడికి ఊరట..

మాజీ కేంద్రమంత్రి, సినీనటుడు చిరంజీవికి ఏపీ హైకోర్టు ఊరట ఇచ్చింది. 2014 ఎన్నికల సమయంలో గుంటూరులో చిరంజీవిపై నమోదైన కేసును కొట్టివేసింది. అప్పటి ఎన్నికల సమయంలో నిర్ణీత సమయంలో సభను పూర్తి చేయలేకపోయారని, దాంతో ట్రాఫిక్‌ సమస్యలు వచ్చాయని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని అప్పట్లో కాంగ్రెస్‌ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చిరంజీవిపై కేసు నమోదైంది. అయితే, తనపై కేసును కొట్టివేయాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో విచారించిన న్యాయస్థానం చిరంజీవిపై నమోదైన కేసును కొట్టివేస్తూ ఆదేశాలిచ్చింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు