- నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న ఫోటోలు..
అమెరికా లాస్ ఎంజెల్స్‌లోని ప్రతిష్టాత్మక అకాడమీ మ్యూజియంను భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు లివింగ్ లెజెండ్‌లు ‘ఉలగనాయగన్’ కమల్ హాసన్, ‘స్వర మాంత్రికుడు’ ఏఆర్ రెహమాన్ సందర్శించారు. మ్యూజియమంతా కలియతిరుగుతూ.. తెగ సందడి చేశారు. అలాగే మ్యూజియంలో ఉన్న ఏఆర్ రెహమాన్ ఆస్కార్ విన్నింగ్ మూమెంట్స్‌ను కమల్ హాసన్ తిలకించారు. అనంతరం మ్యూజియంలో గాడ్ ఫాదర్ చిత్రాన్ని కమల్, రెహమాన్ కలిసి వీక్షించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమాలోని ‘జయహో’ పాటకు ఆస్కార్ వచ్చిన విషయం తెలిసిందే. బెస్ట్ ఓరిజినల్ స్కోర్ & బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగాలలో రెహమాన్‌కు రెండు ఆస్కార్‌లు వచ్చాయి. ఈ చిత్రాన్ని హాలీవుడ్ దర్శకుడు డానీ బోయల్ తెరకెక్కించారు.