Tuesday, May 21, 2024

బంగ్లాపై భారత్‌ సంచలన విజయం

తప్పక చదవండి
  • రెండో టీ 20 విజయంతో సిరీస్‌ సొంతం
  • స్వల్ప స్కోరే చేసినా..అద్భతు బౌలింగ్‌తో రాణింపు
    ఢాకా : క్రికెట్లో సంచలనాలు నమోదవుతాయన్న దానికి నిదర్శనంగా తాజాగా మహిళాల టీ ట్వంటీ మ్యాచ్‌ నిలిచింది. భారత మహిళల క్రికెట్‌ జట్టు ఈ ఏడాది తొలి టీ 20 సిరీస్‌ నెగ్గింది. బంగ్లాదేశ్‌ గడ్డపై రెండో టీ 20లో విజయంతో సిరీస్‌ సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన టీమిండియా రెండో మ్యాచ్‌లోనూ దుమ్మురేపింది. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో భారత్‌ 8 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తుచేసింది. ఆఖరి ఓవర్‌ వరకూ విజయం దోబూచులాడిన పోరులో షఫాలీ వర్మ సంచలన బౌలింగ్‌తో జట్టును గెలిపించింది. తద్వారా మరో మ్యాచ్‌ మిగిలుండగానే హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సేన 20తో సిరీస్‌ కైవసం చేసుకుంది. దీప్తి శర్మ ’ప్లేయర్‌ ఆఫ్‌ ది అవార్డు’ అందుకుంది. ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌టీమిండియాల మహిళల క్రికెట్‌ జట్ల మధ్య మంగళవారం రెండో టీ20 జరిగింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాపై టీమిండియా ఘన విజయం సాధించింది. తొలుత టాస్‌ గెలిచిన టీమిండియా టీమిండియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 95 పరుగలు మాత్రమే చేయగలిగింది. బంగ్లా బౌలర్లలో సుల్తానా ఖాతూన్‌ 3 వికెట్లతో రెచ్చిపోగా.. ఫాతిమా ఖాతూన్‌ 2, మరూఫా అక్తెర్‌, నమిద అక్తెర్‌, రబెయా ఖాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. భారత బ్యాటర్లలో ఒక్కరు కూడా కనీసం 20 పరుగుల మార్కును దాటలేకపోయారు. ఓపెనర్‌ షఫాలీ వర్మ చేసిన 19 పరుగులే టాప్‌, సహా స్మతి మంధన (13), యస్తిక భాటియా (11), దీప్తి శర్మ (10), అమన్‌జోత్‌ కౌర్‌ (14) రెండంకెల స్కోర్లు చేశారు. టీమిండియా స్టార్‌ బ్యాటర్లు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ డకౌట్‌ కాగా.. జెవిూమా రోడ్రిగెజ్‌ (8), హర్లీన్‌ డియోల్‌ (6) నిరాశపరిచారు. అనంతరం 96 పరుగుల లక్ష్య చేదనలో బంగ్లా జట్లు 20 ఓవర్లలో 87 పరుగులకే అలౌటయ్యింది. నిగర్‌ సుల్తానా 38 పరుగులు టాప్‌ స్కోర్‌ కాగా సవిూమా 5, శాంతి రాణి 5 , ముర్షిదా ఖాతూన్‌ 4, మోని 4 , షోరమ్‌ 7, నహిదా 6 , రబియా ఖాన్‌ 0, సుల్తానా ఖాటూన్‌ 0, ఫాహిమా ఖాతూన్‌ 0, మారుఫే 0 నిరాశపరిచారు. కాగా భారత బౌలర్లలో దీప్తి శర్మ 3, షఫాలీ వర్మ 3, మిన్ను మణి 2, బారెడ్డి అనూష 1 వికెట్‌ తీసుకున్నారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ, షఫాలీ వర్మ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ఆఖరి ఓవర్‌ వరకూ ఉత్కంఠగా సాగింది. చివరి ఓవర్‌లో బంగ్లా విజయానికి 10 పరుగులు కావాలి. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ షఫాలీ వర్మకు బంతి ఇచ్చింది. అయితే.. బంగ్లా జట్టు 4 వికెట్లు కోల్పోయి ఒక్క పరుగు మాత్రమే చేసింది. తొలి బంతికి రాబియా రనౌట్‌ కాగా.. రెండో బంతికి నహిద క్యాచ్‌ ఔటయ్యింది. నాలుగో బాల్‌కు ఫాతిమా రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాట పట్టగా.. ఇన్నింగ్స్‌ చివరి బంతికి మారూఫా స్టంపౌట్‌గా వెనదిరిగింది. దాంతో, భారత జట్టు 8 పరుగులతో సంచలన విజయం సాధించింది.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు