- ఘనత సాధించిన అబ్దుల్లాపూర్ మెట్ నివాసి..
ఇటీవల కాలంలో టి.ఎస్.ఎల్.పీ.ఆర్.బీ. వెలువరించిన ఎస్.ఐ. ఫలితాల్లో లారీ డ్రైవర్ వెంకటేశ్వరావు కుమారుడు అవినాష్ సత్తా చాటాడు. సాయిని సాయి అవినాష్ పదవ తరగతి అనంతరం టి.ఎస్.ఆర్.ఆర్.జె.సి. (సర్వైల్)లో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని.. ప్రఖ్యాతిగాంచిన నిజాం కళాశాలలో బీఏ ( ఈ.పీ.పీ. )తో పాటుగా ఎన్.సి.సి.లో ఎస్.యూ.ఓ.గా తన సేవలను అందించాడు. మధ్య తరగతి కావడం మూలంగా అన్నీ ప్రభుత్వ కళాశాలల్లోనే తన విద్యను కొనసాగించాడు. తదనంతరం సికింద్రాబాద్ పీజీ కళాశాలలో ఎం.ఏ. ప్రభుత్వ పరిపాలనలో తన తరగతి లోనే ఉత్తమమైన మొదటి ర్యాంకును సాధించాడు.. చిన్న నాటి నుండే ఎస్.ఐ. కావాలనే తపనతో దానికి తగ్గ కృషి చేసాడు. అందుకు తగిన ఫలితం సాధించి తన ఎదుగుదలకు క్రీడలతో పాటు, వ్యాయామం, ఎన్.సి.సి. తోడ్పాటు లభించిందని తెలియ జేస్తున్నాడు. మధ్య తరగతి కావడం వలన తమ కుమారుడికి ఎస్.ఐ. (సివిల్) ఉద్యోగం సంపాదించడం చాలా సంతోషంగా ఉందని తన తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.