Friday, May 17, 2024

రాజకీయాల్లోకి వస్తాం మా హక్కులను సాధించుకుంటాం….

తప్పక చదవండి
  • వడ్డెర కులస్తుల జాబితా ప్రభుత్వానికి అందించడానికి వడ్డెర సామగ్ర సర్వే
    చేపడుతున్న తెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్
  • రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసేందుకు వడ్డెర కులస్తులు సిద్ధం..

హైదరాబాద్, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వడ్డెర కులస్తులను ఏకం చేసి సభ నిర్వహించారు తెలంగాణ వడ్డెర సంఘం, చారిటబుల్ ట్రస్ట్.. ఈ కార్యక్రమానికి 33 జిల్లాల అధ్యక్షులు, 119 నియోజకవర్గాల నుండి ప్రజలు భారీ ఎత్తున హాజరై సభను విజయవంతం చేశారు..

అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి అయిలమల్లు మాట్లాడుతూ.. మన హక్కులను సాధించుకోవడమే లక్ష్యమని అన్నారు.. అంతే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో సుమారు 40 లక్షల పైచిలుకున్న మన వడ్డెర కులస్తులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే గుర్తించి సమస్యలకు పరిష్కారం చూపాలని అన్నారు.. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వడ్డెర కులస్తుల ఎజెండా ఒకటే బీసీ వర్గం నుండి తొలగించి ఎస్టి వర్గంలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వేముల శ్రీనివాస్.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరికుప్పల వెంకటేష్.. రాష్ట్ర వైస్ చైర్మన్ గండికోట కుమార్.. ఉపాధ్యక్షులు
వరికుప్పల శ్రీశైలం, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు