Saturday, July 27, 2024

కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై పోలీసు కేసు..

తప్పక చదవండి
  • భూ విక్రయం విషయంలో వివాదం..
  • ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ కు కేసు బదిలీ..
  • 2018లో భూ విక్రయం వ్యవహారంలో వివాదం..
  • ఉప్పర్ పల్లి లో ల్యాండ్ కొనుగోలు వ్యవహారంలో కేసు..
  • సామా ఇంద్రపాల్ రెడ్డి దగ్గర నుంచి మూడున్నర కోట్ల రూపాయలు తీసుకున్న ఎమ్మెల్యే ..
  • 2018 నుంచి రిజిస్ట్రేషన్ చేయకుండా తాత్సారం చేసిన ఎమ్మెల్యే ..
  • తనకే డబ్బులు ఇవ్వాలని సామా ఇంద్రపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యే.

హైదరాబాద్, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై పోలీసు కేసు నమోదైంది. ఉప్పరపల్లి స్థల వ్యవహారానికి సంబంధించి నరేందర్ రెడ్డితో మరో ఇద్దరిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. వివరాల్లోకి వెళ్తే.. పట్నం నరేందర్ రెడ్డితో పాటు
మిగిలిన ఇద్దరు నిందితులు వై శ్రీరాంరెడ్డి, రాకేష్‌రెడ్డిలు సామ ఇంద్రపాల్‌రెడ్డి అనే వ్యక్తి తప్పుడు వాగ్దానాలతో భూమి కొనుగోలు ఒప్పందం చేసి మోసం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మధ్యవర్తుల రూపంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, రాకేష్ రెడ్డిలు ఆయనకు పరిచయం అయ్యారు. తమకు తెలిసిన మరికొందరు భూస్వాములు ఉన్నారని వీరిద్దరూ శ్రీరామ్ రెడ్డి అనే మరో వ్యక్తిని ఇంద్రపాల్ కి పరిచయం చేశారు. స్థలం, కమీషన్ తో కలిపి మొత్తం రూ.3.65 కోట్లకు భూమి అమ్ముతామన్నారు. కమీషన్ ఇచ్చేందుకు ఇంద్రపాల్ కూడా అంగీకరించాడు. ఈ క్రమంలో 2018 మే 24న రూ.90 లక్షలు చెల్లించాడు. తర్వాత విడతల వారీగా మొత్తం రూ.3.05 కోట్లు చెల్లించాడు. అంతకుముందు సెక్యూరిటీ కింద ఎమ్మెల్యే, రాకేష్ రెడ్డిలు బాధితుడి వద్ద బ్లాంక్ చెక్కులు తీసుకున్నారు. మిగిలిన రూ.60 లక్షల కోసం లోన్ కు అప్లై చేశానని అది రాగానే చెల్లిస్తానని చెప్పాడు ఇంద్రపాల్. అయితే డబ్బు చెల్లించడానికి లేట్ అవుతుందని.. ఎమ్మెల్యే అనుచరులు అతనిపై బెదిరింపులకు పాల్పడ్డారు.

అలాగే తన భార్యను కూడా బెదిరించారని ఇంద్రపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. బాధితుడు నేరుగా కోర్టును ఆశ్రయించాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన కోర్టు.. ఈ కేసును ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, రాకేష్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు