- సినీ పరిశ్రమలో పకోడీ గాళ్ళు ఎక్కువైయ్యారు..
సినీనటుడు చిరంజీవి ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఘాటుగా సమాదానమిచ్చారు. సినీ పరిశ్రమలో చాలా మంది పకోడిగాళ్లు ఉన్నారని విమర్శించారు. సినీ ఇండస్ట్రీలో ఉన్న కొందరు పకోడిగాళ్లు ప్రభుత్వం ఎలా ఉండాలో సలహా ఇస్తున్నారని దుయ్యబట్టారు. పకోడిగాళ్లు సలహాలు తన వాళ్లకు ఇచ్చుకోవచ్చు కదా అంటూ చిరంజీవికి సూచించారు. డ్యాన్స్‌లు, ఫైట్స్, యాక్షన్ గురించి చూసుకుందాం, రాజకీయాలు ఎందుకని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు సూచించవచ్చు కదా అంటూ పరోక్షంగా వ్యాఖ్యనించారు .
వాల్తేరు వీరయ్య 200 రోజుల ఫంక్షన్‌లో చిరంజీవి మంగళవారం ప్రభుత్వంపై పరోక్ష పలు ఆరోపణలు చేశారు. ప్రభుత్వంలోని కొందరు పిచ్చుక మీద బ్రహ్మస్త్రంలా సినిమా పరిశ్రమపై పడడం శోచనీయమని అన్నారు. రాష్ట్రంలో అసలు విషయాలు వదిలేశారని ఆరోపించారు. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టులు, పేదవారికి కడుపు నింపే విషయం గురించి ఆలోచించాలని సూచించారు. ఉద్యోగ, ఉపాధి కల్పనపై దృష్టిని సారించాలని, పేదలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలందిస్తే అందరూ తలవంచి నమస్కరిస్తారని చిరంజీవి ప్రభుత్వానికి పలు సూచనాలు చేశారు. పవన్ కల్యాణ్ బ్రో రెమ్యునరేషన్‌పై ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు లేవనెత్తిన అంశాలపై సైతం చిరంజీవి కౌంటర్ ఇచ్చారు.