Thursday, June 13, 2024

‘బెదురులంక 2012’ కోసం ‘సొల్లుడా శివ’ అంటున్న కార్తికేయ

తప్పక చదవండి

కార్తికేయ గుమ్మకొండ, ‘డీజే టిల్లు’ ఫేమ్‌ నేహా శెట్టి జంటగా నటించిన ఎంటర్టైనర్‌ ‘బెదురులంక 2012’. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నంబర్‌ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. సి. యువరాజ్‌ సమర్పకులు. క్లాక్స్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆగస్టు 25న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ రోజు సినిమాలో రెండో పాట ‘సొల్లుడా శివ’ను విడుదల చేశారు.
-‘’భోగమంత యిడువనే యిడువవు వింతగుంది రా…

  • నువెవడివి సొల్లుడా శివా… నువెవడివి సొల్లుడా శివా…
  • లోకమన్న లెక్కలకు అందవు గొప్పగుంది రా…
  • నువెవడివి సొల్లుడా శివా… నువెవడివి సొల్లుడా శివా…’’
    అంటూ సాగిన ఈ గీతానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. కృష్ణ చైతన్య సాహిత్యం సమకూర్చారు. అనురాగ్‌ కులకర్ణి, రోల్‌ రైడ, పృథ్వీ చంద్ర ఆలపించారు. చిత్రనిర్మాత బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ ‘’మణిశర్మ గారు అద్భుతమైన బాణీలు అందించారు. ఇప్పటికే విడుదలైన ‘వెన్నెల్లో ఆడపిల్ల’ పాటకు మంచి స్పందన లభించింది. ఇప్పుడీ పాటకు కూడా అద్భుతమైన స్పందన లభిస్తుంది. అవుట్‌ అండ్‌ అవుట్‌ హిలేరియస్‌ ఎంటర్టైనర్‌ ఇది. కొత్త కంటెంట్‌, బ్యూటిఫుల్‌ విజువల్స్‌, మంచి పాటలతో మేం ‘బెదురులంక 2012’ తీశాం. గోదావరి నేపథ్యంలో ఇప్పటి వరకు వచ్చిన రూరల్‌ డ్రామాలకు చాలా భిన్నంగా సినిమా ఉంటుంది. గోదావరి బేస్డ్‌ రూరల్‌ డ్రామా అంటే ‘బెదురులంక 2012’ ఒక బెంచ్‌ మార్క్‌ సెట్‌ చేస్తుంది. ఆగస్టు 25న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అన్నారు.దర్శకుడు క్లాక్స్‌ మాట్లాడుతూ ‘’సొల్లుడా శివ’ పాటలో హీరో క్యారెక్టరైజేషన్‌ చెప్పాం. అలాగే, ఇందులో మా హీరో క్యార్తికేయ అద్భుతంగా డ్యాన్సులు చేశారు. ఈ పాట, అందులో డ్యాన్స్‌, విజువల్స్‌ ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతాయి. మణిశర్మ గారు కథలో సందర్భాలకు తగ్గట్టు ఫెంటాస్టిక్‌ సాంగ్స్‌ ఇచ్చారు. ఆల్రెడీ విడుదలైన టీజర్‌, ‘వెన్నెల్లో ఆడపిల్ల’ పాటకు లభించిన స్పందన మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఆగస్టు 25న చిత్రాన్ని, అంత కంటే ముందు ట్రైలర్‌ ను మీ ముందుకు తీసుకొస్తాం’’ అని అన్నారు.
    కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్‌ ఘోష్‌, రాజ్‌ కుమార్‌ కసిరెడ్డి, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, ‘ఆటో’ రామ్‌ ప్రసాద్‌, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్‌, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్‌, దివ్య నార్ని ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి యాక్షన్‌: అంజి, పృథ్వీ కాస్ట్యూమ్‌ డిజైనర్‌: అనూషా పుంజాల, పి.ఆర్‌.ఓ: పులగం చిన్నారాయణ, ఎడిటింగ్‌: విప్లవ్‌ న్యాసదం, సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, కిట్టూ విస్సాప్రగడ, కృష్ణ చైతన్య, ప్రొడక్షన్‌ డిజైన్‌: సుధీర్‌ మాచర్ల, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: దుర్గారావు గుండా, సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్‌ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి, కొరియోగ్రాఫర్‌: బృంద, మోయిన్‌, సంగీతం: మణిశర్మ, సహ నిర్మాతలు : అవనీంద్ర ఉపద్రష్ట, వికాస్‌ గున్నల, సమర్పణ : సి. యువరాజ్‌, నిర్మాత : రవీంద్ర బెనర్జీ ముప్పానేని, రచన – దర్శకత్వం : క్లాక్స్‌.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు