Saturday, July 27, 2024

కన్నడ బ్లాక్ బస్టర్ ‘హాస్టల్ హుడుగారు బేకగిద్దరే’ని తెలుగులో ‘బాయ్స్ హాస్టల్’గా

తప్పక చదవండి

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యుషన్ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్, కంటెంట్ బేస్డ్ చిత్రాలని రూపొందించే చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్‌తో కలిసి కన్నడ బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు తీసుకొస్తుంది. నితిన్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించిన చిత్రం ‘హాస్టల్ హుడుగారు బేకగిద్దరే’. ప్రజ్వల్ బిపి, మంజునాథ్ నాయక, రాకేష్ రాజ్‌కుమార్, శ్రీవత్స, తేజస్ జయన్న ఉర్స్ నటించిన ఈ చిత్రంలో రిషబ్ శెట్టి, పవన్ కుమార్, షైన్ శెట్టి అతిధి పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రం 500+ థియేటర్ ఆర్టిస్టులను వెండితెరకు పరిచయం చేయడం విశేషం. దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి కూడా ఒక నిర్మాతగా వరుణ్ గౌడ, ప్రజ్వల్ B. P. , అరవింద్ S. కశ్యప్‌లతో కలిసి గుల్‌మోహర్ ఫిల్మ్స్ , వరుణ్ స్టూడియోస్ బ్యానర్‌లపై ఈ చిత్రాన్ని నిర్మించారు.

పరంవా పిక్చర్స్ బ్యానర్‌పై రక్షిత్ శెట్టి సమర్పించారు.
ఈ చిత్రం గత నెలలో కన్నడలో విడుదలై యునానిమస్ పాజిటివ్ టాక్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం ఇప్పటికే 20+ కోట్లు వసూలు చేసి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ & చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ కలిసి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తెలుగులో ‘బాయ్స్ హాస్టల్’ అనే టైటిల్ తో ఆగస్ట్ 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో హాస్టల్, అందులోని అబ్బాయిలు, ముఖాల్లో సీరియస్ ఎక్స్ ప్రెషన్ లో కనిపించారు.
ఈ చిత్రానికి వెరీ ట్యాలెంటెడ్ కంపోజర్ బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించగా, అరవింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రఫీ అందించారు. సురేష్ ఎమ్ ఎడిటర్.
మేకర్స్ విడుదల తేదీని అనౌన్స్ చేయడంతో తెలుగు ప్రమోషన్లు ప్రారంభమయ్యాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు