Thursday, May 16, 2024

జోధ్‌పూర్‌ ఐఐటీలో సైంటిఫిక్‌ ఆఫీసర్‌ పోస్టులు..

తప్పక చదవండి

కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, బయాలజీ తదితర విభాగాల‌లో చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్‌, ప్రిన్సిపల్ సైంటిఫిక్ ఆఫీసర్‌, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టుల భ‌ర్తీకి రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల‌ను బ‌ట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు ప‌ని అనుభ‌వం క‌లిగి ఉండాలి. రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్‌, ఇంటర్వ్యూ ద్వారా అభ్య‌ర్థుల ఎంపిక ఉంటుంది.

మొత్తం పోస్టులు : 04.. పోస్టులు : చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్‌, ప్రిన్సిపల్ సైంటిఫిక్ ఆఫీసర్‌, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ త‌దిత‌రాలు… విభాగాలు : కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, బయాలజీ తదితరాలు.. అర్హతలు : పోస్టుల‌ను బ‌ట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు ప‌ని అనుభ‌వం క‌లిగి ఉండాలి. వయసు: 50-57 ఏండ్లు ఉండాలి. జీతం: నెలకు రూ.101500 నుంచి రూ.159100.. ఎంపిక : రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్‌, ఇంటర్వ్యూ ద్వారా.. దరఖాస్తు : ఆన్‌లైన్‌లో.. చివరి తేది: జూన్ 17
వెబ్‌సైట్ : https://www.iitj.ac.in/

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు