Friday, September 13, 2024
spot_img

టెక్ ఇండస్ట్రీ లో కొన‌సాగుతున్న లేఆఫ్స్..

తప్పక చదవండి
  • 4000 మందిపై బెట‌ర్‌.కాం వేటు
    టెక్ ప్రపంచంలో లేఆఫ్స్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ది. ఆర్ధిక మంద‌గ‌మ‌నం వెంటాడుతుండ‌టంతో మార్ట్‌గేజ్ సంబంధిత సేవ‌ల‌ను అందించే ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం బెట‌ర్‌.కాం త‌న రియ‌ల్ ఎస్టేట్ విభాగాన్ని మూసివేసింది. రియ‌ల్ ఎస్టేట్ యూనిట్‌ను మూసివేస్తూ మొత్తం టీంను విధుల నుంచి తొల‌గించిన‌ట్టు బెట‌ర్‌.కాం వ్య‌వ‌స్ధాప‌క సీఈవో విశాల్ గార్గ్ వెల్ల‌డించారు. దీంతో కంపెనీ ఇప్ప‌టివ‌ర‌కూ మొత్తం 4000 మంది ఉద్యోగుల‌పై వేటు వేసింది. మార్ట్‌గేజ్ మార్కెట్‌లో నెల‌కొన్న అనిశ్చితి వాతావ‌ర‌ణం కార‌ణంగా ఈ సంక్లిష్ట నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని కంపెనీ పేర్కొంది. మ‌రోవైపు బాధిత ఉద్యోగుల‌కు ఎలాంటి ప‌రిహార ప్యాకేజ్‌ను కూడా కంపెనీ వ‌ర్తింప‌చేయ‌లేద‌ని ఉద్యోగులు చెబుతున్నారు. మార్ట్‌గేజ్ వ‌డ్డీ రేట్ల పెరుగుద‌ల‌తో ఈ ప‌రిశ్ర‌మ‌లో నిల‌దొక్కుకునేందుకు కంపెనీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేప‌ధ్యంలో బెట‌ర్‌.కాం రియ‌ల్ ఎస్టేట్ విభాగం మూసివేత నిర్ణ‌యం ఆశ్చ‌ర్యం క‌లిగించ‌లేదు.

మ‌రోవైపు సోష‌ల్ మీడియా వెబ్‌సైట్ రెడిట్ 90 మంది ఉద్యోగుల‌ను విధుల నుంచి తొలగించింది. ఇక ఉద్యోగుల త‌గ్గింపు, పున‌ర్వ్య‌వ‌స్ధీక‌ర‌ణ‌తో రాబోయే రోజుల్లో మెరుగైన ప‌నితీరు క‌న‌బ‌రుస్తామ‌ని కంపెనీ ఆశిస్తోంది. వ్య‌య నియంత్ర‌ణ చ‌ర్య‌లు, ఆర్ధిక అనిశ్చితి కార‌ణ‌గా గ్లోబ‌ల్ టెక్ దిగ్గ‌జాల‌తో పాటు భార‌తీయ స్టార్ట‌ప్‌లు కూడా గ‌త ఏడాదిగా ఏకంగా 27,000 మందికిపైగా విధుల నుంచి తొల‌గించాయి. లేఆఫ్స్ ట్రెండ్ మున్ముందు కూడా కొన‌సాగ‌నుంద‌ని టెక్ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు