Tuesday, September 10, 2024
spot_img

మొద‌టి రోజునే భార‌త జ‌ట్టు ఓడిపోయింది..

తప్పక చదవండి
  • సంచలన వ్యాఖ్యలు చేసిన బీసీసీఐ బాస్..
    ప్రపంచ టెస్టు చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో క‌చ్చితంగా గెలుస్తుదంనుకున్న‌ భార‌త్ చిత్త‌గా ఓడింది. టాపార్డ‌ర్ బ్యాట‌ర్లు రెండు ఇన్నింగ్స్‌ల్లో విఫ‌లం కావ‌డంతో టెస్టు గ‌ద‌ను చేజార్చుకుంది. రెండోసారి ఫైన‌ల్లో టీమిండియా చ‌తికిల‌బ‌డ‌డంపై బీసీసీఐ అధ్య‌క్షుడు రోజ‌ర్ బిన్నిస్పందించాడు. భార‌త జ‌ట్టు ఫైనల్ మొద‌టి రోజునే మ్యాచ్ కోల్పోయింద‌ని బిన్ని అభిప్రాయ‌ప‌డ్డాడు.

‘టీమిండియా బౌల‌ర్ల‌ను ధాటిగా ఎదుర్కొన్న‌ ట్రావిస్ హెబ్, స్టీవ్ స్మిత్ సెంచ‌రీల‌తో చెల‌రేగారు. దాంతో, ఆసీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 469 ప‌రుగుల భారీ స్కోర్ అందించారు. అలా జ‌రిగి ఉండ‌క‌పోతే ఇరుజ‌ట్ల‌కు విజ‌యావ‌కాశాలు ఉండేవి’ అని బిన్ని వెల్ల‌డించాడు. సౌర‌భ్ గంగూలీ ప‌దవీకాలం ముగియ‌డంతో రోజ‌ర్ బిన్నీ బీసీసీఐ బాస్‌గా ఎన్నిక‌య్యారు. 1983 వ‌రల్డ్ క‌ప్ గెలిచిన జ‌ట్టులో తొలిసారి వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన క‌పిల్ దేవ్ బృందంలో బిన్ని ఒక‌డు.

టెస్టు క్రికెట్‌కు కొత్త జీవం తెచ్చిన టెస్టు చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో భార‌త్, ఆస్ట్రేలియా త‌ల‌ప‌డ్డాయి.టాస్ గెలిచిన రోహిత్ శ‌ర్మ ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఆదిలోనే డేవిడ్ వార్న‌ర్, ఉస్మాన్ ఖ‌వాజా ఔట్ చేసిన భార‌త బౌల‌ర్లు ఆసీస్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. అయితే… ఆత‌ర్వాత వ‌చ్చిన ట్రావిస్ హెడ్(163), స్టీవ్ స్మిత్(121) సెంచ‌రీల‌తో చెల‌రేగ‌డంతో ఆస్ట్రేలియా మొద‌టి ఇన్నింగ్స్‌లో 469 ర‌న్స్ కొట్టింది. ఆ త‌ర్వాత భార‌త్ 269కే ఆలౌట‌య్యింది. రెండో ఇన్నింగ్స్‌ను ఆసీస్ 270వ‌ద్ద డిక్లేర్ చేసింది. 444 ప‌రుగుల ఛేద‌న‌లో టీమిండియా 234కు ఆలౌట‌య్యింది. విరాట్ కోహ్లీ(49), అజింక్యా ర‌హానే(46), శ్రీ‌క‌ర్ భ‌ర‌త్‌(23) పోరాడినా లాభం లేక‌పోయింది. లియాన్ ఓవ‌ర్లో సిరాజ్ ఔట్ కావ‌డంతో దాంతో 209 ప‌రుగుల‌తో ఆసీస్‌ అద్భుత విజ‌యం సాధించింది. దాంతో, రెండోసారైనా చాంపియ‌న్‌గా నిల‌వాల‌నుకున్న టీమిండియా క‌ల చెదిరింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు