2023 సంవత్సరానికి సంబంధించి అస్సాం రైఫిల్స్ స్పోర్ట్స్ కోటా ర్యాలీ నిర్వహిస్తుండగా.. ఈ ర్యాలీలో రైఫిల్స్‌మ్యాన్, రైఫిల్ ఉమెన్ పోస్టుల భర్తీకి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని అస్సాం రైఫిల్స్ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి, మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణతతో పాటు క్రీడా అర్హతలు, నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అభ్యర్థి ధృవీకరణ, ఫీల్డ్ ట్రయల్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫుట్‌బాల్, అథ్లెటిక్స్, రోయింగ్, పెన్‌కాక్ సిలాట్, క్రాస్ కంట్రీ, ఆర్చరీ, బాక్సింగ్, సెపక్‌తక్రా, బ్యాడ్మింటన్ తదితర క్రీడలలో ఖాళీలను భర్తీ చేయనుంది. దరఖాస్తుల ప్రక్రియ జూలై 01 నుంచి ప్రారంభంకాగా.. జూలై 30 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 81.. పోస్టులు : రైఫిల్స్‌మ్యాన్, రైఫిల్ ఉమెన్.. అర్హతలు : పదో తరగతి, మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణతతో పాటు క్రీడా అర్హతలు, నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.. వయస్సు : 18 నుంచి 23 ఏండ్ల మధ్య ఉండాలి. క్రీడ విభాగాలు : పెన్‌కాక్ సిలాట్, క్రాస్ కంట్రీ, ఆర్చరీ, బాక్సింగ్, సెపక్‌తక్రా, బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్, అథ్లెటిక్స్, రోయింగ్.. ఎంపిక : అభ్యర్థి ధృవీకరణ, ఫీల్డ్ ట్రయల్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు : ఆన్‌లైన్‌లో
చివరి తేదీ: జూలై 30.. ర్యాలీ తేదీ: ఆగస్ట్ 07.. వేదిక: అస్సాం రైఫిల్స్ ట్రైనింగ్ సెంటర్ అండ్ స్కూల్, సుఖోవ్, నాగాల్యాండ్.. వెబ్‌సైట్ : www.assamrifles.gov.in