Friday, May 3, 2024

పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ వారాహి యాత్ర..

తప్పక చదవండి
  • భీమవరంలో శెట్టిబలిజలతో జనసేనాని సమావేశం
  • బీసీలు బలపడితేనే రాజ్యాధికారం వస్తుందని వెల్లడి
  • సంపూర్ణ మద్యనిషేధం దేశంలో ఎక్కడా సాధ్యం కాలేదని వ్యాఖ్యలు

అమరావతి, 29 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
పశ్చిమ గోదావరి జిల్లాలో వారాహి యాత్ర కొనసాగిస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్ గురువారం భీమవరంలో శెట్టిబలిజ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీసీలకు రాజ్యాధికారం రావాలని ఆకాంక్షించారు. శెట్టిబలిజలను గౌడ కులస్తులుగా గుర్తించాలని అన్నారు. ఇతరులతో పోల్చితే బీసీలలో ఐక్యత తక్కువగా ఉంటుందని, బీసీలు బలపడితేనే రాజ్యాధికారం వస్తుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణలో గీత కార్మికుల కోసం ఈత వనాలు పెంచుతున్నారని వెల్లడించారు. ఏపీలో కూడా అలాంటివే ఏర్పాటు చేస్తే బాగుంటుందని, తద్వారా కులవృత్తులను ప్రోత్సహించినవారవుతారని అభిప్రాయపడ్డారు. సంపూర్ణ మద్యపాన నిషేధం దేశంలో ఎక్కడా సాధ్యం కాలేదని, మద్యపాన నిషేధం వల్ల బ్లాక్ మార్కెట్ పెరుగుతుందని పవన్ వివరించారు. మద్యం అమ్మకాల్లో గౌడ కులస్తులకు వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. చీప్ లిక్కర్ తాగడం వల్ల ఆరోగ్యాలు పాడవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు